మూడేళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులు: నటి ఆవేదన

30 Oct, 2020 19:59 IST|Sakshi

ఆమిర్‌ ఖాన్‌ స్పోర్ట్స్‌ డ్రామా దంగల్‌లో నటించిన తరువాత ఈ సినిమా పేరు నటి ఫాతిమా సనా షేక్‌కు ఇంటి పేరుగా మారింది. బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ సాధించిన ఈ సినిమాలో రెజ్లర్‌ గీతా ఫోగట్‌ పాత్రలో కనిపించి తన నటనతో ప్రశంసలు అందుకున్నారు ఫాతిమా. ఇక ఈ నటి తన బాల్యం నుంచే యాక్టింగ్‌ కెరీర్‌ను ప్రారంభించారు. కాగా దంగల్‌ సినిమాలోని సహనటి సన్య మల్హోత్రాతో ఫతిమా డేటింగ్‌ చేస్తున్నట్లు ఇటీవల వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. అనంతరం దీనిపై స్పందించిన ఫాతిమా తాము కేవలం మంచి స్నేహితులమని, తమ స్నేహాన్ని తప్పుగా భావించవద్దని కోరారు. తాజాగా ఈ నటి తన జీవితానికి సంబంధించి ఓ భయంకరమైన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. తనకు మూడేళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. చదవండి: ‘మా స్నేహన్ని తప్పుగా చూస్తున్నారు’

ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ‘నేను మూడేళ్ల వయసులోనే వేధింపులకు గురయ్యాను. లైంగిక వేధింపుల స‌మ‌స్య చుట్టూ ఒక క‌ళంకం ఉంది. అందుకే మహిళలు తమ జీవితాంతం ఈ గురించి బయటకు చెప్పలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రపంచం మారుతుందని ఆశిస్తున్నాను. చదువుకోవడం వల్ల లైంగిక వేధింపుల గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్ర‌జ‌లు ఈ అంశం గురించి భిన్నంగా ఆలోచిస్తారు. అందుకే నేను ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు’. అని చెప్పుకొచ్చారు. చదవండి: అభిమానుల‌కు షాకిచ్చిన పున్నూ బేబీ

అదే విధంగా తను కూడా కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని వెల్లడించారు. సెక్స్ చేయడం ద్వారానే నాకు ఉద్యోగం లభించే ఏకైక మార్గం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. దానికి తను ఒప్పుకోకపోవడం వల్ల చాలా ప్రాజెక్టులు తన చేయి దాటి పోయిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఫాతిమా ప్ర‌స్తుతం లుడో, సూర‌జ్ పే మంగ‌ల్ భ‌రీ మూవీస్‌లో న‌టిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా