శృంగారం గురించి మాట్లాడాలంటే ఇక్కడి జనాలు భయపడతారు: దంగల్ నటి

21 Oct, 2021 11:24 IST|Sakshi

ఆమీర్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘దంగల్‌’ మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటించి యాక్ట్రెస్‌ సాన్యా మల్హోత్రా మంచి గుర్తింపు పొందింది. అనంతరం సినిమాలు, షోలు చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. ఈ బ్యూటీ తాజాగా ‘ససురల్ వండర్ ఫూల్’ అనే రొమాంటిక్‌ కామెడీ షోలో అషిమా అనే పాత్ర పోషిస్తోంది. ఇది అడిబుల్‌ ప్రసారమయ్యే ఓ పాడ్‌కాస్ట్‌. భారత్‌లో జనాలు శృంగారం గురించి మాట్లాడాలంటే భయపడతారని ఈ భామ తెలిపింది. 

షో గురించి ఈ  బ్యూటీ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకూ శృంగారమనే పదం భారత్‌లో నిషిద్ధం. కానీ ఇటీవల సినిమా, ఇతర డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ల వల్ల కొద్దిగా మార్పు వస్తోంది. అందుకే ‘ససురల్‌ వండర్‌ ఫూల్‌’ వంటి స్టోరీస్‌ని రూపొందించేందుకు క్రియేటర్స్‌ ముందుకు వస్తున్నార’ని తెలిపింది.

సాన్యా తన షో గురించి మాట్లాడుతూ.. ‘ఇందులో నేను చేసే ‘అషిమా’ పాత్రకి శృంగారం అనే పదం వాడాలంటే ఇబ్బంది పడుతుంది. అలాంటిది తన భర్త, ఇతర కుటుంబ సభ్యులు దానికి సంబంధించిన క్లీనిక్‌ని నడుపుతుంటే.. ఆమె పరిస్థితి ఎంటానేది స్టోరీ’ అని చెప్పింది. మేం ఈ షోతో కొంత మందినైనా మార్చగలమని ఆశిస్తున్నామని తెలిపింది. దీని స్ఫూర్తితో కొందరైనా సరే ఇలాంటి విషయాలను బహిరంగంగా మాట్లాడతారని అనకుంటున్నామని పేర్కొంది. చర్చిస్తారనుకుంటున్నాం.

 చదవండి: సినిమాలకి గుడ్‌ బై చెప్పిన రెండేళ్లకి.. సోషల్‌ మీడియాలో ‘దంగల్‌’ నటి

మరిన్ని వార్తలు