దాసరి బయోపిక్‌..  దాసరి అవార్డులు

12 Jul, 2021 01:07 IST|Sakshi
దాసరి నారాయణరావు

దివంగత దర్శకులు దాసరి నారాయణరావు జీవితం తెరపైకి రానుంది. ఇమేజ్‌ ఫిల్మ్స్‌ అధినేత తాటివాక రమేష్‌ నాయుడు ‘దర్శకరత్న’ పేరుతో ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు ధవళ సత్యం దర్శకత్వం వహించనున్నారు. అంతేకాదు దాసరి జ్ఞాపకార్థం ‘దాసరి నారాయణరావు ఫిల్మ్‌ అండ్‌ టీవీ నేషనల్‌ అవార్డ్స్‌’ కూడా ప్రదానం చేసేందుకు తాడివాక రమేష్‌ నాయుడు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా రమేష్‌ నాయుడు మాట్లాడుతూ– ‘‘నా గురువు, దైవం అయిన దాసరిగారి పేరుతో ప్రతి ఏటా ఫిల్మ్‌ అండ్‌ టీవీ నేషనల్‌ అవార్డ్స్‌ ఇవ్వాలని సంకల్పించాం. ఇందుకోసం ఇప్పటికే ‘దాసరి నారాయణరావు మెమోరియల్‌ కల్చరల్‌ ట్రస్ట్‌’ ఏర్పాటు చేశాం. పలు భాషలకు చెందిన కళాకారులు–సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు కూడా ఇవ్వనున్నాం. అలాగే ధవళ సత్యంగారు ‘దర్శకరత్న’ స్క్రిప్ట్‌ పనులు పూర్తి చేశారు. ఓ ప్రముఖ హీరో ఈ చిత్రంలో  దాసరి పాత్రలో నటించనున్నారు’’ అన్నారు.

మరిన్ని వార్తలు