బుల్లితెర నటికి అరుదైన వైరస్.. వారికి దూరంగా ఉండాలట!

1 Mar, 2023 19:59 IST|Sakshi

ఇటీవల చాలా మంది అనారోగ్యానికి గురైన వార్తలు చూస్తున్నాం. గతంలో సమంత,  మమత మోహన్ దాస్, హంసా నందిని ఇలా చాలానే హీరోయిన్లు అరుదైన వ్యాధుల బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బుల్లితెర నటికి అరుదైన వైరస్ సోకినట్లు తెలిసింది. ఈ వైరస్ సోకిన వారు చిన్న పిల్లలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. 

ఇటీవల తన భర్త, పిల్లలతో కలిసి శ్రీలంక టూర్‌ వెళ్లింది బాలీవుడ్ బుల్లితెర నటి దేబినా బోనర్జీ. శ్రీలంక నుంచి తిరిగొచ్చాక వైద్య పరీక్షల్లో ఆమెకు ఇన్‌ఫ్లుఎంజా బి వైరస్‌ సోకినట్లు తేలింది. ఈ వైరస్ బారిన పడినవారు చిన్న పిల్లలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

చాలా రోజులుగా సాధారణ జలుబు అని భావించి దానిని పట్టించుకోలేదు. కానీ జలుబు, జ్వరం తగ్గకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకుంది. దీంతో ఆ పరీక్షల్లో ఇన్‌ఫ్లుఎంజా బి వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే నటి ప్రస్తుతం కోలుకుంటున్నారని.. అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని సన్నిహితులు తెలిపారు.

దేబినా బోనర్జీ 2008లో వచ్చిన రామాయణంలో సీత పాత్ర పోషించింది. ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌తో కలిసి నంజుండి చిత్రంలో నటించింది. ఆమె మొదటి టెలివిజన్ పాత్ర తమిళ టీవీ సీరియల్ మాయావి. ఆమె చిడియా ఘర్, అనేక రియాల్టీ షోలలో మయూరిగా కూడా కనిపించింది.

మరిన్ని వార్తలు