బీచ్‌కి దగ్గరలో ఇల్లు కొన్న దీపికా దంపతులు.. ధర ఎంతో తెలుసా?

15 Sep, 2021 16:11 IST|Sakshi

బాలీవుడ్ సినిమాల్లో జంటగా నటించి.. నిజ జీవిత భాగస్వాములుగా మారిన నటులు ఉన్నారు. అందులో ఇప్పటికీ తమ కెరీర్‌లో ఎంతో బిజీగా ఉన్న జంట దీపికా పదుకొనే, రణ్‌వీర్‌ సింగ్‌. వారిద్దరి చేతుల్లో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రొఫెషనల్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయిస్తుంది ఈ బాలీవుడ్‌ జంట. తాజాగా ఈ కపుల్‌ కొన్న ఇల్లు బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.  ఎందుకంటే ఆ ఇల్లు ధర రూ. 22 కోట్లు మరి.

ప్రస్తుతం ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలోని 26వ అంతస్తులో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో దీపికా దంపతులు ఉంటున్నారు. అయితే మహారాష్ట్రలోని అలిబాగ్‏లోని మాప్‏గావ్ గ్రామంలో  2.25 ఎకరాలలో ఈ ఇల్లును నిర్మించినట్లు వినికిడి. రూ.22 కోట్లు పెట్టి కొన్న ఈ ఇంటి రిజిస్ట్రేషన్‌ కోసమే స్టాంప్ డ్యూటీగా రూ. 1.32 కోట్లు చెల్లించినట్లు సమాచారం. గతంలో  ఈ బంగ్లా ది ఎవర్ స్టోన్ గ్రూప్ అధినేత రాజేష్ జగ్గికు చెందినదిగా ప్రచారంలో ఉంది. కిహిమా బీచ్ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలో ఉన్న ఈ ఇంట్లో 5 బెడ్‌రూమ్‌లు ఉ‍న్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ ప్రాంతంలో ఇల్లు కొన్నారు.

కాగా ఈ బాలీవుడ్‌ కలిసి కపిల్‌ దేవ్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న '83'లో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా రణ్‌వీర్‌ ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’, ‘రాకీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహాని’ల్లో నటిస్తుందడగా.. అమితాబ్‌తో ‘ది ఇంటర్న్‌’, హృతిక్‌ రోషన్‌తో ‘ఫైటర్‌’, అలాగే ఓ హాలీవుడ్‌ మూవీతో దీపికా బిజీగా ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు