Deepika Padukone: యాసిడ్‌ బాధితురాలికి దీపికా రూ. 15 లక్షల ఆర్థిక సాయం

6 Sep, 2021 18:19 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకునే సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారు. ఇప్పటికే ఆమె ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌ (టీఎల్‌ఎల్‌ఎల్‌ఎఫ్‌)’ ద్వారా మానసిక అనారోగ్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ యాసిడ్‌ బాధితురాలికి రూ. 15 లక్షల ఆర్థిక సాయం అందించి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. బాల ప్రజాపతి అనే యాసిడ్‌ బాధితురాలు కొంతకాలంగా కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

చదవండి: తల్లి ఆరోగ్యం విషమం, లండన్‌ నుంచి తిరిగొచ్చిన అక్షయ్‌ కుమార్‌

ఈ క్రమంలో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు వైద్యులు మూత్రపిండాల మార్పిడి చేయాలని సూచించారు. దీనికి 16 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో చాన్వ్‌ ఫౌండేషన్‌ వారు నిధుల సేకరణ ప్రారంభించారు. ఈ విషయం దీపికా దృష్టికి వెళ్లడంతో ఆమె 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. కాగా దీపికా ఇటూ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికి ఖాళీ సమయంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుతున్నారు.

చదవండి: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే!

ఇటీవల ఫ్రంట్‌లైన్‌ ఆర్టిస్ట్‌ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి దీని ద్వారా మానసిక ఒత్తిళ్లను బయటకు చెప్పిస్తున్నారు. అంతేగాక వారికి నిపుణుల ద్వారా కౌల్సిలింగ్‌ ఇప్పిస్తున్నారు. కాగా దీపికా ప్రస్తుతం హిందీలో తన భర్త ర‌ణ్‌వీర్‌ సింగ్‌తో క‌లిసి ‘83’,  షారుక్‌ ఖాన్‌తో ‘ప‌ఠాన్’ మూవీతో పాటు ఫైటర్‌, సంకీ, కే వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే శకున్ బాత్రా డైరెక్ష‌న్‌లో ఓ సినిమాతో పాటు నాగ్ అశ్విన్-ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల మరో హాలీవుడ్‌ సినిమాకు కూడా దీపిక సంతకం చేయగా.. ఈ మూవీకి ఆమె కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. 

చదవండి: హాలీవుడ్‌కు డబ్బులు ఇస్తున్న దీపికా పదుకొనె!

>
మరిన్ని వార్తలు