దీపికా పదుకునే బ్యాగ్‌ కలెక్షన్‌

16 Jan, 2021 09:46 IST|Sakshi

సెలబ్‌ స్టయిల్‌

దుస్తులే కాదు హ్యాండ్‌బ్యాగ్‌ కూడా మనదైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింపజేస్తుంది. బాలీవుడ్‌ తార దీపికా పదుకునే వాడే హ్యాండ్‌ బ్యాగ్‌ సందర్భానికి తగినట్టుగా ఉంటుందని ఆమె కలెక్షన్‌ను చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. అవేంటో ఓ లుక్కేయండి. 

ఎయిర్‌పోర్ట్‌కు మినీ బ్యాగ్‌... 
ప్రయాణాలు చేసేటప్పుడు సౌకర్యమే కాదు, స్టయిల్‌ కూడా తగ్గకుండా ఉండాలి. ఎత్తుమడమల జోలికి పోకుండా స్నీకర్స్, ప్లిప్‌ ప్లాప్స్‌ వంటివి ఎంచుకోవచ్చు. నార్మ్‌కోర్‌ ఔట్‌ఫిట్స్‌ (జీన్స్, టీ షర్ట్‌ పైన స్వెట్‌ షర్ట్‌) సన్‌గ్లాసెస్, తక్కువ మేకప్, వదిలేసిన కురులు.. వీటన్నింటినీ మించి నియాన్‌ కలర్‌ మినీబ్యాగ్‌పై మన దృష్టి పడకుండా ఉండదు. ఎయిర్‌పోర్టులో అవసరమైన పేపర్ల కోసం మాత్రమే దీని ఎంపిక. (చదవండి: జోడీ కుదిరిందా?)

తెలుపు డ్రెస్‌ మీదకు బ్రౌన్‌ బ్యాగ్‌... 
సందర్భం ఏదైనా దీపికా అడుగుపెట్టిన చోట తనదైన స్టయిల్‌ను చూపించగలదు. టాప్‌ టు బాటమ్‌ వైట్‌ డ్రెస్‌ ధరించినప్పుడు పూర్తి కాంట్రాస్ట్‌ కలర్‌ కాకుండా ముదురు గోధుమరంగు షార్ట్‌ హ్యాండిల్‌ బ్యాగ్‌ ఒక ప్రత్యేకతను చాటుతుంది. 

చల్లని వేళ... 
అధిక శీతోష్టపరిస్థితులకు అనుగుణంగా టాప్‌ టు బాటమ్‌ స్వెటర్‌ టైప్‌ డ్రెస్‌ ధరించినప్పుడు బ్లాక్‌ లూయీస్‌విట్టన్‌ ఓపెన్డ్‌ బ్యాగ్‌ ఎంపిక చేసుకుంది. 
 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు