దీపికా మేనేజర్‌కు మరోసారి ఎన్‌సీబీ సమన్లు

2 Nov, 2020 14:46 IST|Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు దర్యాప్తు భాగంగా స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌కు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూర్‌(ఎన్‌సీబీ) మరోసారి సమన్లు‌లు జారీ చేసింది. గత నెలలో ఎన్‌సీబీ  ఆమెకు సమాన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కరిష్మా ప్రకాష్‌ విచారణకు గైర్హాజరు కావడంతో కరిష్మా పరారీలో ఉన్నట్లు అధికారుల గుర్తించారు. దీంతో ఇవాళ (సోమవారం) ఎన్‌సీబీ ఆమెకు మరోసారి సమన్లు జారీ చేసి, ఆ నోటీసులు ఆమె తల్లి మితాక్షర పురోహిత్‌కు అందచేశారు ఈ సందర్భంగా ఎన్‌సీబీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే దీపికా పదుకొనెతో పాటు ఆమె మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌ను ప్రశ్నించాం. ఈ క్రమంలో కరిష్మా ఇంటిలో సోదాలు నిర్వహించగా ఆమె ఇంట్లో 1.7 కిలోగ్రాముల చరాస్‌, మూడు సీసాల సీబీడీ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నాం. దీనిపై కరిష్మాను మరోసారి విచారించేందుకు సమన్లు జారీ చేశాం. అయితే అప్పటికే ఆమె పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో తాజాగా మరోసారి సమన్లు జారీ చేశాం’ అని తెలిపారు. (చదవండి: పరారీలో హీరోయిన్‌ దీపిక మేనేజర్‌)

అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నటి రియా చక్రవర్తి ఎన్‌సీబీ విచారణలో పలువురు బాలీవుడ్‌ నటీనటులు పేర్లను వెల్లడించింది. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టగా ‌ దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా ఆలీ ఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ల పేర్లు ఉన్నాయి. అంతేగాక దీపికా, ఆమె మేనేజర్‌ కరిష్మాల పాత వాట్సప్‌ డ్రగ్స్‌ చాట్‌ కూడా వెలుగులోకి రావడంతో వీరిద్దరిని ఎన్‌సీబీ విచారణకు పిలిచింది. అలాగే వీరితోపాటు శ్రద్దా కపూర్‌, సారా, రకుల్‌‌లకు కూడా ఎన్‌బీసీ అధికారులు సమన్లు ఇచ్చారు. వీరిపై ఎలాంటి నేరారోపణలు రుజువు కాకపోవడంతో వారిని ఎన్‌సీబీ తిరిగి పంపించిన విషయం తెలిసిందే. చదవండి: మరిన్ని కోడ్ వర్డ్‌లు బయటపెట్టిన దీపికా!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు