Deepika Padukone: ఆ సమయంలో చనిపోదామనుకున్నా.. దీపికా పదుకొనె ఎమోషనల్‌

12 Sep, 2021 21:26 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ  దీపికా పదుకొనె 2014లో తీవ్రమైన డిప్రెషన్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మామూలుగా అయితే  ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. కానీ దీపికా మాత్రం అన్నీ చెప్పుకుంది. తాజాగా ఆమె  బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’టీవీ షోలో దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌తో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా అమితాబ్‌.. దీపిక డిప్రెషన్‌లోకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేయగా, దాని గురించి ఆమె మరోసారి వివరించింది.  లేవగానే విచిత్రంగా ఉండేదని, ఏ పని చేసినా ఏదో లాగుతున్నట్లు ఉండేదని, నిద్ర పట్టకపోయేదని, ఉన్నట్టుండి ఏడ్చేసేదాన్ననీ.. అన్నీ.. అన్నీ చెప్పుకుంది.


(చదవండి:  చిన్నారి చికిత్సకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌.. అమితాబ్‌ సాయం)

‘2014లో నేను డిప్రెషన్‌లో ఉన్నాను.లేవగానే విచిత్రంగా ఉండేది. ఉన్నట్టుండి ఏడ్చేసేదాన్ని. ఎవరితోనైనా మాట్లాడాలని గానీ.. బయటికి వెళ్లాలని గానీ అనిపించేంది కాదు. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండేదాన్ని. చాలా సందర్భాల్లో ఏమీ చేయలేకపోతున్నా ఎందుకు బతకడం అనిపించేది. ఆ సమయంలో చనిపోదామనుకున్నా. నా మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించిన మా అమ్మ.. వెంటనే సైకియార్టిస్ట్‌ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చింది. కొన్ని నెలల పాటు చికిత్స తీసుకున్న తర్వాత డిప్రెషన్‌ నుంచి బయటపడ్డాను’అని దీపికా ఎమోషనల్‌ అయింది. తను అనుభవించిన బాధ మరెవరూ అనుభవించొద్దనే ఉద్దేశ్యంలో ‘లివ్‌ లవ్‌ లాఫ్‌’ఫౌండేషన్‌ స్థాపించానని దీపికా చెప్పుకొచ్చింది. ఈ పౌండేషన్‌ ద్వారా చాలా మంది డిప్రెషన్‌ నుంచి బయటపడ్డారని సంతోషం వ్యక్తం చేసింది. దీపిక ఇలా బాధపడే సమయంలోనే ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ చిత్రంలో నటించిందని,  షూటింగ్‌ సమయంలో ఒక్క శాతం కూడా బాధపడుతున్నట్టు కనిపించలేదని చెప్పింది ఆ చిత్ర దర్శకురాలు  ఫరాఖాన్‌.

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

మరిన్ని వార్తలు