విరామం తీసుకోవాల్సిందే: స్టార్‌ హీరోయిన్‌

4 Jan, 2021 11:24 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకోన్‌ సోషల్‌ మీడియా ఖాతాలను ఖాళీ చేయడంతో అభిమానులు ఎంతగానో ఆందోళన చెందారు. కొత్త సంవత్సరం తొలి రోజే ఇంత పెద్ద షాకిచ్చిందేంటని కలవరానికి లోనయ్యారు. ఆమె నుంచి స్పెషల్‌ గ్రీటింగ్స్‌ కాదు కదా పోస్టులన్నీ డిలీట్ చేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి లోనయ్యారు. ఆమె అకౌంట్‌ హ్యాక్‌ అయిందా? లేదా హ్యాండిచ్చిందా? అని అనుమానపడ్డారు. వీటన్నింటికీ చెక్‌ పెడుతూ ఆమె అదే రోజు సాయంత్రం నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ ఆడియో క్లిప్పింగ్‌ను షేర్‌ చేశారు. (చదవండి: ఖాతా ఖాళీ చేసిన స్టార్‌ హీరోయిన్‌)

రాజస్థాన్‌లోని రణతంబోర్‌ పార్క్‌లోలో భర్త రణ్‌వీర్‌తో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్న ఆమె తాజాగా ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. తన కుటుంబంతో క్వాలిటీ సమయం గడుపుతున్నట్లు పేర్కొన్నారు. "నేను కెరీర్‌పరంగా ఎంతో సాధించినప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం రవ్వంత కూడా మారలేదని నావాళ్లు చెప్తూ ఉంటారు. కానీ నా విజయంలో వాళ్ల పాత్ర ఎంతుందనేది వారికే తెలియదు. వాళ్ల కోసం సమయం కేటాయించడం నాకు అత్యవసరం. దీనివల్ల నేను ఎక్కడి నుంచి ఎక్కడిదాకా చేరుకున్నానో ఓసారి తిరిగి చూసుకోవచ్చు. కాబట్టి దీనికోసం బ్రేక్‌ తీసుకోవాల్సిందే!" అని రాసుకొచ్చారు. కాగా రణ్‌బీర్‌ కపూర్‌- అలియా భట్‌ జంట కూడా రణతంబోర్‌లో హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేసి శనివారం నాడు ముంబైకి తిరిగి వచ్చేశారు.. (చదవండి: కొత్త ఏడాది, కొత్త పోస్టర్స్‌)

A post shared by Deepika Padukone (@deepikapadukone)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు