ఆ సమయంలో నరకం చూశా, మైండ్‌ అసలు పని చేయలేదు: దీపికా పదుకొణె

26 Dec, 2021 13:05 IST|Sakshi

కరోనా మహమ్మారి సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ భామ దీపికా పదుకొణె ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్వూలో సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ సమయంలో తాను గడిపిన రోజులకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.  దీపికా మాట్లాడుతూ.. వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ చాలా మంది జీవితాలను మార్చివేసిందని, తాను కూడా సెకండ్‌ వేవ్‌ సమయంలో చాలా ఇబ్బందులు పడినట్లు చెప్తూ భావోద్వేగానికి లోనైంది. 

ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్ సమయంలో తనకు మాత్రమే కాదని తన కుటుంబం మొత్తానికి ఒకే సమయంలో కోవిడ్‌ సోకిందని తెలపింది. దీంతో మహమ్మారి నుంచి కోలుకోవడానికి తమకి చాలా సమయమే పట్టిందని చెప్పుకొచ్చింది. కోవిడ్‌ తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని అంతేగాక తను ఫిజికల్‌గా మారినట్లు తెలపింది. లాక్‌డౌన్‌ సమయంలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అ‍ప్పటి పరిణామాల కారణంగా తన మైండ్‌ సరిగా పని చేయలేదని అందుకు రెండు నెలలు తన పనికి సెలవు పెట్టి విశ్రాంత్రి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది.

మొదటి కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో దీపికా పదుకొణె, ఆమె భర్త, నటుడు రణవీర్ సింగ్ ముంబైలోని వారి నివాసంలో ఉన్నారు. సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ సమయంలో, ఈ క్యూట్‌ కపుల్‌ దీపికా తల్లిదండ్రులతో కొన్ని రోజులు గడపడానికి బెంగళూరుకు వెళ్లారు. దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ కొత్త సినిమా 83 శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. 1983లో లార్డ్స్‌లో జరిగిన ప్రపంచకప్‌లో భారతదేశం సాధించిన చారిత్రాత్మక విజయం ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. రణవీర్ సింగ్ అప్పటి క్రికెట్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రను పోషిస్తుండగా, దీపికా పదుకొనే కపిల్ దేవ్ భార్య రోమిగా నటించింది. 

చదవండి: Merry Christmas: విజయ్‌ సేతుపతికి జోడీగా కత్రినా కైఫ్‌

మరిన్ని వార్తలు