Deepika Padukone: దీపికా నవ్వుకు ఫిదా అయినా పాకిస్తాన్‌ ఫ్యాన్‌

28 Sep, 2021 19:40 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ల జాబితాలో దీపికా పదుకొనే ముందు వరుసలో ఉంటుంది. సినీ పరిశ్రమలో ఆమెకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా తనకు సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంటూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను, సరదా సన్నివేశాలను, రీల్స్‌, ఫొటోషూట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం ఆమె షేర్‌ చేసిన ఓ ఫొటోషూట్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. 

ఇందులో ఓ ఫొటోలో దీపికా అందంగా నవ్వుతూ కనిపించింది. దీంతో ఆమె నవ్వుకు ఫిదా అవుతూ పాకిస్తాన్‌ అభిమాని పెట్టిన కామెంట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. ‘ఆ చిరునవ్వు నా హృదయాన్ని కలిగి ఉంది’ సదరు అభిమాని కామెంట్‌ పెట్టగా.. ‘మీరు నవ్విన​ప్పుడు ప్రపంచం ఆగిపోతుంది’, ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కూడా మీరు మరింత అందంగా ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. బ్లాంక్‌ అండ్‌ వైట్‌ టైగర్‌ ప్రింట్‌ టాప్‌ ధరించిన ఫొటో షూట్‌ను ఆమె షేర్‌ చేసింది. ఈ పోస్టుకు ఇప్పటి వరకు 1.3 మిలియన్లకు పైగా లైక్స్‌ వచ్చాయి. 

మొదటి ఫొటోలో ఆమె టచ్‌అప్‌ ఇస్తుండగా.. రెండో ఫొటోలో దీపికా నవ్వుతూ ఫోజు ఇచ్చింది. దీనికి ఆమె ‘ముందు.. ఆ తర్వాత’ అంటూ క్యాప్షన్‌ జంత చేసి షేర్‌ చేసింది. ఇక దీపీకా సినిమాల విషయానికి వస్తే.. తన భర్త, హీరో రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ఆమె 83 మూవీలో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న విషయం తెలిసిందే. మాజీ టీమిండియా కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా కపిల్‌ భార్య రోమీ భాటియా పాత్ర పోషిస్తోంది. అలాగే షారుక్‌ ఖాన్‌తో ‘పఠాన్‌’తో పాటు ‘జయేశ్‌భాయ్‌ జోర్దార్‌’, ‘సర్కాస్‌’ వంటి చిత్రాలతో ఆమె బిజీగా ఉంది. 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

మరిన్ని వార్తలు