నేను అలానే పెరిగాను.. ఇప్పుడు మారలేను: దీపికా

21 Jan, 2021 00:01 IST|Sakshi

పప్పులు ఉప్పులు నేనే ఆర్డర్‌ చేస్తా

పెద్ద పెద్ద హీరోయిన్లంటే తెల్లవారిపోయాక తొమ్మిదింటికి లేచి బ్రష్‌ నోట్లో పెట్టుకుంటారని అనుకుంటాము. కాని దీపికా పడుకోన్‌ అలా ఉండదట. తన ఇంటి పనులు తానే చేసుకుంటుందట. ‘‘నేను అందరు స్త్రీల్లానే ఉదయాన్నే లేచి ఇంటి పనులు చూస్తాను. ఒక్కోరోజు నీళ్లు రావు. ఒక్కోరోజు పనివాళ్లు రారు. నాకు మేనేజర్లు ఉన్నా వారు సినిమాలకు సంబంధించిన పనులే చూస్తారు.

ఇంటి సమస్యలు నేనే చూసుకుంటా. ఇంట్లో వస్తువులు నేనే గమనించుకుంటా. పప్పులు ఉప్పులు నేనే ఆర్డర్‌ ఇస్తా. ఇలా చేసుకునే విధంగా నేను పెరిగాను. ఇప్పుడు నేను మారలేను. రణ్‌వీర్‌ సింగ్‌ (భర్త) నేను ఇవన్నీ చేయడం చూసి ఆశ్చర్యపోతుంటాడు. ‘ఎందుకు నీకిదంతా చెప్పు’ అంటాడు కన్సర్న్‌తో. కాని నాకు ఈ పనులు చేసుకోవడం ఇష్టం’’ అని చెప్పింది దీపికా పడుకోన్‌.

రణ్‌వీర్‌ సింగ్, దీపికా పడుకోన్‌ల కెరీర్‌ మంచి ఊపు మీద ఉండగా కోవిడ్‌ వచ్చింది. అదీ ఒకందుకు మంచిదే అయ్యింది. ఈ జంట కలిసి ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేయగలిగామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నిజజీవిత భార్యాభర్తలు తెర మీద భార్యాభర్తలుగా నటించిన ‘83’ సినిమా విడుదల కావాల్సి ఉంది. కపిల్‌దేవ్‌ బయోపిక్‌గా తయారైన ఈ సినిమాలో రణ్‌వీర్‌ కపిల్‌గా, దీపికా కపిల్‌ భార్య రోమిగా నటించారు. ఇద్దరూ బాగా కుదిరారని అభిమానులు కితాబిచ్చారు. సినిమా వస్తే సిక్సరే కావచ్చు. చూద్దాం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు