Deepthi Sunaina: ఈ విషయం నాక్కూడా తెలీదే అంటూ సెటైర్‌ వేసిన దీప్తి..

25 Jan, 2022 14:09 IST|Sakshi

Deepthi Sunaina Reaction On Her Tollywood Debut Rumours, Post Inside: సోషల్‌ మీడియా స్టార్‌ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలుత డబ్స్‌ మ్యాష్‌ వీడియోలతో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులర్‌ అయింది. ఇక రీసెంట్‌గా షణ్నూతో బ్రేకప్‌తో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తమ దారులు వేరంటూ 5ఏళ్ల రిలేషన్‌ షిప్‌కు ముగింపు పలికింది.

బ్రేకప్‌ అనంతరం కెరీర్‌పై దృష్టి పెట్టిన దీప్తి సునయన త్వరలోనే హీరోయిన్‌గా పరిచయం కానుందంటూ ఓ వార్త తెగ వైరల్‌ అవుతుంది. దీనిపై స్పందించిన దీప్తి సునయన ఇది ఫేక్‌న్యూస్‌ అంటూ కొట్టి పారేసింది.

ఇన్‌స్టాలో ఈ మేరకు ఫోటోను షేర్‌ చేస్తూ నేను హీరోయిన్‌గానా చేస్తున్నానా? ఈ విషయం నాకు తెలీదే అంటూ సెటైర్‌ వేసింది.  దీంతో మొత్తానికి దీప్తి సునయన సిల్కర్‌ స్క్రీన్‌కు పరిచయం కానుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

మరిన్ని వార్తలు