షణ్ముఖ్‌తో దీప్తి సునయన.. అక్కడేం చేస్తుంది?

3 May, 2021 13:57 IST|Sakshi

సోషల్‌ మీడియాలో దీప్తి సునయన- షణ్ముఖ్‌ జశ్వంత్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్‌ వీడియోలతో బాగా పాపులర్‌ అయిన ఈ జంట ఆ తర్వాత డబ్స్‌మాష్‌, కవర్‌ సాంగ్స్‌ వీడియాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. ఆన్‌ స్ర్కీన్‌ పెయిర్‌గానే కాకుండా ఆఫ్‌ స్ర్కీన్‌లోనూ వీరిద్దరి కెమెస్ర్టీకి ఎంతోమంది అభిమానులున్నారు. మధ్యలో వీరి లవ్‌ స్టోరీకి శుభం కార్డు పడిందని వార్తలు వచ్చినా అవి కేవలం పుకార్లేనని చెబుతూ ఇద్దరూ కలిసి కొన్ని ఫోటో షూట్స్‌లోనూ కనిపించారు.

ఇటీవలె ఓ ప్రముఖ షోలో పాల్గొన్న దీప్తి- షణ్ముఖ్‌​.. తాము ఆఫ్‌ స్ర్కీన్‌ కపుల్స్‌ అని క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టినట్లయ్యింది. అంతేకాకుండా ఇద్దరూ ఒకే తరహా టాటూలు వేయించుకొని ఒకరిపై ఒకరికున్న ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో త్వరలోనే ఈ క్యూట్‌ కపుల్‌ పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది. తామిద్దరం ఆఫ్‌ స్ర్కీన్‌ లోనూ కపుల్స్‌ అని ప్రకటించుకున్న ఈ జంట పెళ్లి విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా దీప్తి సనయన- జశ్వంత్‌ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నట్లుగా బెడ్‌పై ఉన్న ఫోటోను దీప్తి షేర్‌చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఈ ఫోటోను అభిమానులతో షేర్‌ చేసుకోవడంతో దీనిపై ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది. ఇద్దరూ ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉన్నారా? లేక ఏదైనా షూట్‌ కోసం కలిశారా అని ఫ్యాన్స్‌ ఆరా తీస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరు కలిసి వీడియో సాంగ్స్‌ చేసి చాలా కాలమే అయ్యింది. దీంతో ఆన్‌ స్ర్కీన్‌పై వీరిద్దరిని చూడాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరి ఈ ఫోటో దానికే సంకేతమా? లేదా ఏదైనా ఫ్రెండ్స్‌ పార్టీనా అన్నది ఇంకా రివీల్‌ కాలేదు. ప్రస్తుతం షణ్ముఖ్‌ ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి : 'దీప్తి సునయన -షణ్ముఖ్‌ పెళ్లి అప్పుడే ఉండొచ్చు'
యాంకర్‌ రవి కారులో.. సీక్రెట్స్‌ బయటపెట్టేసిన లాస్య

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు