సమంత నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా: నటుడు

18 Jun, 2021 21:01 IST|Sakshi

స‌మంత‌, మ‌జోజ్‌బాయ్‌పేయి, ప్రియ‌మ‌ణి ప్రధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన వెబ్‌ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. రాజ్ డీకే ద‌ర్శ‌కత్వంలో వచ్చిన ఈ సిరీస్ ఆమెజాన్‌ ప్రైంలో ఇటీవల విడుదలై అత్యధిక రేటింగ్స్‌ దూసుకోపోతుంది. పాజిటివ్‌ టాక్‌ తెచ్చకుంటూ నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ఈ సిరీస్‌లో ఢిల్లీకి చెందిన నటుడు షాహ‌బ్ అలీ కీలక పాత్ర పోషించాడు. ఇందులో త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌ అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు షాహ‌బ్ అలీ. ఈ నేపథయంలో తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స‌మంత‌తో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్ గురించి షాహ‌బ్ అలీ మాట్లాడుతూ..డైరెక్ట‌ర్స్ రాజ్ డీకే న‌న్ను సంప్ర‌దించిన‌పుడు ఈ సిరీస్‌లో స‌మంత ఉంద‌ని తెలిసి చాలా ఎక్సయిట్ అయ్యాను అని చెప్పాడు. 

‘ఆమె పెద్ద స్టార్. నాకు స్ఫూర్తి. సూప‌ర్ డీల‌క్స్‌తో పాటు స‌మంత న‌టించిన కొన్ని సినిమాలు చూశాను. మొద‌ట భ‌య‌ప‌డ్డా. కానీ షూటింగ్ మొద‌ల‌య్యాక నాలో ఉన్న భ‌యం పోయి సౌక‌ర్యంగా ఫీల‌య్యేలా చేశారు స‌మంత‌. ఆమె చాలా డెడికేష‌న్ క‌లిగిన న‌టి. స‌మంత నుంచి చాలా నేర్చుకున్న. ఆమె ద‌గ్గ‌ర నేర్చుకున్న విష‌యాలు నా కెరీర్‌కు ఉప‌యోగ‌ప‌డుతాయి’ అంటూ షాహబ్‌ చెప్పుకొచ్చాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు