Unstoppable With NBK: బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

30 Dec, 2022 17:32 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్‌ షోపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్లతో వరుస ఎపిసోడ్స్‌ షూట్ చేసుకున్న ఆహా టీం.. వాటిని స్ట్రీమ్ చేసుకునేందుకు ప్లాన్‌ చేసుకుంది. ఈ క్రమంలో షూటింగ్‌ జరుగుతుండగానే వీటికి సంబంధించని వీడియోలు, ఫొటోలు నెట్టింట దర్శనం ఇస్తున్నాయి. అధికారిక ప్రకటనకు ముందే లీకు వీరులు ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోనలు ఆన్‌లైన్‌లో షేర్‌ చేస్తున్నారు.

చదవండి: రొమంటిక్‌ సీన్స్‌లో హీరోల ప్రవర్తన అలా ఉంటుంది: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ క్రమంలో అర్హ మీడియా అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ టాక్‌ షోకు సంబంధించిన అనధికార స్ట్రీమింగ్‌, ప్రసారాలను వెంటనే తొలగించాలని టెలికమ్యూనికేషన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ, ఇంటర్నెట్‌  ప్రొవైడర్లను ఆదేశించింది. కాగా అనధికారికంగా ఈ షోను ప్రసారం చేయడం వల్ల షోపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. స్టార్‌ హీరో ప్రభాస్‌తో బాలకృష్ణ చేసిన ఇంటర్వ్యూ న్యూయర్‌ కానుకగా గురువారం(డిసెంబర్‌ 29న) ప్రసారం అయ్యింది.

చదవండి: రాజమౌళి ఫుట్‌బాల్‌ ఆడేస్తాడని రానాకి ముందే చెప్పా: ప్రభాస్‌

ఈ నేపథ్యంలో సదరు ఎపిసోడ్‌తో పాటు, మిగిలిన ఎపిసోడ్‌లు అనధికారికంగా ప్రసారం కాకుండా ఆదేశాలు ఇవ్వాలని గురువారం లాయర్‌ ప్రవీణ్‌ ఆనంద్‌, అమిత్‌ నాయక్‌లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తిని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెబ్‌సైట్స్‌తో పాటు ఇతర మీడియా మాధ్యమాలపై చర్యలు తీసుకునేలా ‘డైనమిక్‌ ఇంజక్షన్‌’ ఇవ్వకపోతే ఫిర్యాదుదారుకి భారీ నష్టం వస్తుందని కోర్టు పేర్కొంది. అందుకే తదుపరి విచారణ వరకూ మధ్యంతర ఇంజెక్షన్‌ మంజూరు చేస్తున్నట్లు హైకోరక్టు పేర్కొంది. 

మరిన్ని వార్తలు