Devatha serial: నందా అసలు స్వరూపాన్ని బయటపెట్టేసిన కమల

5 May, 2021 16:33 IST|Sakshi

సత్య-ఆదిత్యల ప్రేమాయణంబయటపెట్టాస్తానంటూనందా బెదిరిస్తుండటం, సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరో తెలుసుకోవాలని రాజేశ్వరి ఆరాటపడుతుంటంతో ఎపిసోడ్‌ రోజు రోజుకి ఆసక్తిగా మారిపోయింది. మరోవైపు సత్య-నందాలకి పెళ్లి చేయాలని దేవుడమ్మ నిర్ణయించడం, ఈ గండం నుంచి సత్యను ఎలా బయటపడేయాలో అని ఆదిత్య ఆరాటపడుతుండం ప్రేక్షకులను రక్తి కట్టిస్తుంది. ఈ నేపథ్యంలో దేవత సీరియల్‌ నేడు (మే 5)న 225వ ఎపిసోడ్‌లోకి ఎంటర్‌ అయిపోయింది. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేద్దాం.

సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం కారణం ఎవరో తెలుసుకోవాలని రాజేశ్వరి తెగ ఆరాటపడుతుంటుంది. ఈ నిజం తెలుసుకొని దేవుడమ్మను దెబ్బకొట్టాలని నందాతో కలిసి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై నందాను పిలిపించి అడుగుతుంది. సత్య కడుపుకి కారణం ఎవరో చెప్పు? ఈ నిజం నాకు తెలియాలి అంటూ నందాను నిలదీస్తుంది. అయితే రహస్యాలు చెప్పుకునేంత ర్యాపో ఇద్దరి మధ్యా లేదని, ఇలాంటి ఆణిముత్యాలాంటి నిజాల్ని చెప్పాలంటే ముందు మీపై నాకు నమ్మకం కలగాలి అని నందా బదులిచ్చాడు. దీంతో ఆ నమ్మకం ఎలా వస్తుంది అంటూ ఒకింత ఫైర్‌ అవుతుంది రాజేశ్వరి. ఓ 50 వేల రూపాయలు ఇవ్వండి మీరిచ్చిన డబ్బు చూసినప్పుడల్లా మీకు నిజం చెప్పానిపిస్తుంటుంది అని నందా పేర్కొనగా.. కడుపుకి అన్నం తింటావా? లేక డబ్బులు తింటావా అంటూ రాజేశ్వరి ఫైర్‌ అయ్యింది. 

సీన్‌ కట్‌ చేస్తే.. సత్య.. భాగ్యమ్మ కూతురు కాదన్న నిజం నందాకి తెలిసిపోయిందని, అంతేకాకుండా సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఆదిత్యే అన్న నిజం కూడా బయటపెడ్తానని నందా బెదిరిస్తున్నాడని చెబుతూ కమల బాధ పడుతుంటుంది. మా అక్కా చెల్లెళ్లకు ఏదో దరిద్రం పట్టినట్లుంది అందుకే మా తలరాత ఇలా అయ్యింది అంటూ కుమిలిపోతుంటుంది. నందా నిజ స్వరూపం తెలుసుకున్న భాషా అతడిని చావబాదుతుంటగా నేను సత్యకి కాబోయే భర్తను.. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని అంటూ నందా అమాయకుడిలా నటిస్తుంటాడు. దీంతో మరింత కోపోద్రిక్తుడైన భాషా.. నీ బాగోతం ఏంటో తనకు తెలుసని అసలు నీ వెనకున్నది ఎవరో చెప్పాలని నందాని అడుతుతాడు. అయితే దీనికి ఆన్సర్‌ ఇవ్వక పోగా తనతో చేతులు కలిపితే లెక్కలేనంత డబ్బు ఇస్తానని నందా డీల్‌ మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దీంతో రుక్కు కోసం తాను ప్రాణాలు ఇస్తానని, అలాంటిది నీ బెదిరింపులకు లొంగనని చెప్పాడు. నిజం చెబుతా అని బెదిరిస్తున్నావ్‌ కదా అసలు నిన్నే లేకుండా చేస్తే నిజం ఎలా చెబుతావంటూ నందాని బాష కత్తితో పొడిచాడు. అయితే ఇదంతా నిజం కాదు. కేవలం కల మాత్రమే. తనకు వచ్చిన పీడకలతో గట్టిగా అరుస్తుంది కమల. దీంతో ఏమైందని భాగ్యమ్మ అడిగినా జవాబు చెప్పకుండా దాటవేస్తుంది. 

ఇక సీన్‌ కట్‌ చేస్తే నందా పెడుతున్న టాచ్చర్‌ నుంచి కొన్ని రోజులు తప్పించుకోవాలని, తన ఇంటికెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుందని సత్య ఆలోచిస్తుంటుంది. ఈలోగా నందా వచ్చి 'ఏంటీ అంత డీప్‌గా ఆలోచిస్తున్నావ్‌? నన్ను ఎలా చంపాలా అని ప్లాన్‌ చేస్తున్నావా? అంతలా ఆలోచించకు దీనికి నీ మాజీ ప్రియుడు, మీ బావ ఆదిత్య వద్దే చాలా ప్లాన్స్‌ ఉంటాయ్‌ అంటూ' మాటలతో హింసిస్తుంటాడు.. ఇక ఓ అద్భుతం చూపిస్తానని, బయటకు రావాలంటూ సత్యని అడుగుతాడు. మరి ఆ ఆద్బుతం ఏంటి? సత్యని నందా ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు అన్నది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది. 


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు