టెక్నీషియన్‌గా పనిచేశా..వాళ్ల కష్టం నాకు తెలుసు: నటి 

5 Sep, 2021 09:03 IST|Sakshi

కలలు కన్న జీవితం కోసం క్రమశిక్షణను ఆలంబనగా మలచుకుంది..
స్క్రీన్‌ ట్రావెల్‌ స్టార్ట్‌ చేసింది.. ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకుంది.. 
సహాయ దర్శకురాలు, నటి దేవిక వత్స.. 

 ♦ ముంబైలో పుట్టి పెరిగింది. తండ్రి ఆర్మీ ఆఫీసర్‌ కావడంతో స్కూలింగ్‌ మొత్తం దేశంలోని వివిధ ప్రాంతాల్లో గడిచింది.

 ♦  యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసి, మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది.

 ♦  మొదట పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. తర్వాత యూట్యూబ్‌ వీడియోలు, షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసింది.

 ♦   2017లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ‘గబ్రూ: హిప్‌ హాప్‌ కే షెహజాదే’ తో వెబ్‌దునియాలోకి ఎంటర్‌ అయింది. అది మంచి విజయం సాధించడంతో వరుసగా ‘ద గుడ్‌ వైబ్స్‌’,  ‘ఇట్స్‌ నాట్‌ దట్‌ సింపుల్‌’,  ‘చీజ్‌ కేక్‌’ సిరీస్‌లలో నటించింది.

 ♦  వెండితెర మీద కనిపించాలన్నది ఆమె ఆశ. అయితే తొలుత ఆఫ్‌ స్క్రీన్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం దొరకింది.. ‘హమారీ అధూరీ కహానీ’ సినిమాకు. ఆ సమయంలోనే  ‘దమ్‌ లగా కే హైశా’ సినిమాలోని ఓ పాత్రకు ఎంపికైంది.

 ♦   ఆ సినిమా నుంచి నటిగా అవకాశాలు క్యూ కట్టాయి. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. 

 ♦ యాక్టర్ల కంటే టెక్నీషియన్ల కష్టమే ఎక్కువ. వారికి ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలి. ఇది నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసినందుకు చెప్పడం లేదు. యాడ్‌ షూట్స్‌ చేసే సమయంలోనే వారి కష్టం నాకు తెలిసింది. అందుకే కొన్ని రోజులు టెక్నీషియన్‌గా పనిచేశా.
– దేవికా వత్స.  

చదవండి : 'ఆ హీరో ఫిజిక్‌ ది బెస్ట్‌..రష్మికను బలవంతంగా గెంటేస్తా'
హీరోయిన్‌ త్రిషను అరెస్ట్‌ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు