దేవినేని: నిజాలు చూపించాం

18 Jan, 2021 08:34 IST|Sakshi

నందమూరి తారకరత్న టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అనేది ట్యాగ్‌లైన్‌. శివనాగు దర్శకత్వంలో జిఎస్‌ఆర్, రాము రాథోడ్‌ సంయుక్తంగా నిర్మించారు. రాజకీయ నాయకుడు  దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను ‘మా’ అసోసియేషన్‌ కార్యదర్శి జీవితా రాజశేఖర్‌ విడుదల చేయగా, ఫస్ట్‌ లుక్‌ను నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌ విడుదల చేశారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ.. ‘తారకరత్న అద్భుతమైన నటుడు. ఈ చిత్రంతో అతనికి పెద్ద బ్రేక్‌ రావాలని కోరుకుంటున్నామన్నారు.

దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. ‘గతంలో బెజవాడను బేస్‌ చేసుకుని కొన్ని సినిమాలు వచ్చినా వాటికి పోలిక లేకుండా ఈ చిత్రాన్ని తీశాం. ఇంతవరకూ ఎవరూ చూపించని నిజాలను ఇందులో చూపించాం. వంగవీటి రంగాని ఎవరు చంపారు అనేది ఈ చిత్రంలో చూపించాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రంగ పాత్రలో నటించిన సురేశ్‌ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో నటించిన నిర్మాత టి. ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు