‘గగన్‌ తన భార్య నగలు దొంగిలించాడు’

8 Dec, 2020 13:07 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ టీవీ నటి దివ్యా భట్నాగర్‌ కరోనాతో పోరాడి మృతి చెందిన సంగతి తెలిసిందే. అతి పిన్న వయసులోనే ఆమె కన్నుమూయడం విచారకరం. ఇక ఏడాది క్రితం దివ్యా భట్నాగర్..‌ తన తల్లిదండ్రులు, స్నేహితులకు ఇష్టం లేకుండా గగన్‌ గబ్రూ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా భర్తతో కలిసి ఉంటున్నారు. అయితే దివ్యకు కోవిడ్ సోకడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దివ్యా భట్నాగర్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ దేవోలీనా భట్టాచార్జీ గగన్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియో రిలీజ్‌ చేశారు. దివ్య భర్త గగన్‌ సరైన వ్యక్తి కాదని.. డబ్బు కోసమే ఆమెని వివాహం చేసుకున్నాడని దేవోలీనా ఆరోపించారు. (చదవండి: న‌న్ను, నా ఫ్యామిలీని చంపేస్తామంటున్నారు)

దేవోలీనా మాట్లాడుతూ.. ‘కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఇష్టం లేకుండా దివ్య, గగన్‌ని వివాహం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఆమె మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తోంది. గగన్‌, దివ్యని కొట్టేవాడు. తన బంగారాన్ని దొంగిలించాడు. అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి షిమ్లా పోలీస్‌ స్టేషన్‌లో అతడిపై కేసు కూడా నమోదయ్యింది. ఆరు నెలలు తన సొంత ఊరిలో జైలులో గడిపాడు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతునే ఉంది. దివ్య చాలా భావోద్వేగాలు గల వ్యక్తి. ఆ విషయం గ్రహించే అతడు ఆమెని ఆకర్షించాడు. పెళ్లి చేసుకునేలా ఒప్పించాడు. తన నిర్ణయం గురించి ఆమెకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా తొందరపెట్టాడు. ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, స్నేహితులు అందరూ గగన్‌ని వివాహం చేసుకోవద్దని దివ్యని హెచ్చరించారు. కానీ ఆమె వారి మాటలను సీరియస్‌గా తీసుకోలేదు’ అంటూ దేవోలినా ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఆ రోజు రానే వచ్చింది)

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

గగన్‌ గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు దేవోలీనా. ఇక దివ్య ‘ఏ రిషిత క్యా కెహలాతా హై’, ‘సంస్కార్’, ‘ఉడాన్’, ‘జీత్‌ గయి తొహ్ పియా మోర్రే’ వంటి సిరీయల్స్‌లో నటించారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు