Dhanush Aishwarya: విడాకులు రద్దు!.. కలిసుండాలని నిర్ణయించుకున్న స్టార్‌ కపుల్‌

4 Oct, 2022 13:34 IST|Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌-ఐశ్వర్యలు విడాకులు రద్దు చేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు. ఈ ఏడాది ప్రారంభంలో.. ధనుష్‌,ఐశ్వర్యలు సోషల్‌ మీడియా వేదికగా భార్యభర్తలుగా విడిపోతున్నాం అని ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 18ఏళ్ల వివాహం తర్వాత ధనుష్‌ దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు ప్రకటించడం అభిమానులకు కూడా ఆవేదనను గురిచేసింది. వీరిద్దరూ కలిసి ఉంటే బాగుండు అని అంతా అనుకున్నారు. ఇప్పుడిదే నిజం కాబోతున్నట్లు తెలుస్తుంది. ధనుష్‌-ఐశ్వర్యలు తమ విడాకుల ప్రకటనను రద్దు చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవలె రజనీకాంత్‌ ఇంట్లో ఇరు కుటుంబసభ్యులు సమావేశమయ్యారట.

ఈ సందర్భంగా ఈ జంట మధ్య సయోధ్య కుదిరినట్లు సమాచారం. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఐశ్వర్య-ధనుష్‌లు కలిసి ఉండాలనే నిర్ణయించుకున్నారట. ఇదే గనుక నిజమైతే, అభిమానులకు ఇంతకంటే గుడ్‌న్యూస్‌ ఏముంటుంది. 

మరిన్ని వార్తలు