సీక్వెల్‌ మూవీ: హీరోని మార్చిన డైరెక్టర్‌

2 Jan, 2021 12:11 IST|Sakshi

తమిళ హీరో కార్తీ నటించిన యుగానికి ఒక్కడు సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే.  తమిళంలో తెరకెక్కిన ఆయిరత్తిల్ ఒరువన్ సినిమాకు తెలుగు అనువాదమే యుగానికి ఒక్కడు. ‘7/జి బృందావన్ కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి హిట్‌ సినిమాలను అందిం‍చిన దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకుంది.

తాజాగా సినిమాకు సీక్వెల్‌ని ప్రకటించాడు డైరెక్టర్‌ సెల్వ రాఘవన్‌. అయితే ఈ సినిమాలో మాత్రం కార్తి హీరోగా నటించడం లేదు. కారణం ఏంటో తెలియదు కానీ.. కార్తి స్థానంలో ధనుష్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ధనుష్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆయిరత్తిల్ ఒరువన్ 2 కోసం పూర్తి స్థాయిలో కష్ట పడతామని ధనుష్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాడు. ఓ యువ‌కుడు కొండ పైనుండి కింద ఉన్న ప‌ర్వ‌తాల‌ను చూస్తుంటాడు. తొలిభాగ‌మైన యుగానికి ఒక్క‌డు సినిమాకు ఇది కొన‌సాగింపుగా ఉంటుందన‌డానికి ఇదే ప్రూఫ్‌గా క‌నిపిస్తోంది. 2024లో ఈ సినిమా విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు