Dhanush: అసిస్టెంట్ పెళ్లిలో ధనుశ్ సందడి.. వీడియో వైరల్!

18 Sep, 2023 11:24 IST|Sakshi

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుశ్ పెళ్లిలో సందడి చేశారు. తన అసిస్టెంట్ ఆనంద్ వివాహానికి  ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన ధనుశ్ నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం పెళ్లిలో ధనుశ్ దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇవీ చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ధనుశ్‌తో పాటు అసురన్ సహనటుడు కెన్ కరుణాస్ కూడా ఉన్నారు. అక్కడే ధనుష్ రాధిక, శరత్‌కుమార్‌లను కలిశారు. కాగా.. ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అసిస్టెంట్ పెళ్లికి హాజరైన సందడి చేసిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: స్టార్‌ హీరో బాలీవుడ్ ఎంట్రీ.. ఆ సూపర్‌ హిట్ డైరెక్టర్‌తోనే!)

కాగా.. ప్రస్తుతం ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. గతంలో రాకీ, సాని కాయిదం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్, శివ రాజ్‌కుమార్, నివేదిత సతీష్, సందీప్ కిషన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత ఆనంద్ ఎల్ రాయ్‌తో తేరే ఇష్క్ మే అనే  చిత్ చేయనున్నారు. వీరిద్దరూ గతంలో రాంఝనా, అత్రంగి రే చిత్రాల్లో కలిసి పనిచేశారు.

(ఇది చదవండి: అలా అయితేనే ఇండస్ట్రీలో కొనసాగుతాం: హీరోయిన్ కామెంట్స్ వైరల్!)

మరిన్ని వార్తలు