తన సినిమాకు డైలాగ్స్‌ రాసుకుంటున్న ధనుష్‌

27 Aug, 2021 09:45 IST|Sakshi

నటుడు ధనుష్‌ ముగ్గురు భామలతో రొమాన్స్‌ చేయడానికి సిద్ధమయ్యారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తిరుచ్చిట్రమ్‌బలం. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జవహర్‌ మిత్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా దీనికి నటుడు ధనుష్‌ కథనం, సంభాషణలు అందించడం విశేషం. ఆయనకు జంటగా నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియా భవాని శంకర్‌ నటిస్తున్నారు. భారతీరాజా, ప్రకాష్‌రాజ్‌ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ ప్రారంభమైంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు