‘సార్‌’గా వస్తున్న ధనుష్‌.. మోషన్‌ పోస్టర్‌ అదిరింది

23 Dec, 2021 10:52 IST|Sakshi

కోలివుడ్‌ స్టార్‌ ధనుష్‌ తొలి తెలుగు సినిమా టైటిల్‌ వచ్చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘సార్‌’అని నామకరణం చేసినట్లు మేకర్స్‌ ప్రకటించారు. తమిళంలో ‘వాతి’అనే టైటిల్‌తో తెరకెక్కుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విషయాలను తెలియజేస్తూ మేకర్స్‌ ఓ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.

టైటిల్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో ధనుష్ టీచర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. కాగా, ధనుష్‌ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు.

మరిన్ని వార్తలు