భలే అనుభవం

1 Nov, 2020 00:31 IST|Sakshi

తమిళ నటుడు ధనుష్‌ మల్టీ టాలెంటెడ్‌ అని అందరికీ తెలిసిందే. హీరోగా బిజీగా ఉంటూనే అప్పుడప్పుడూ పాటలు రాస్తుంటారు, పాడుతుంటారు కూడా. ‘3, కొడి, మారి, మారీ 2, పటాస్, తిక్క’ సినిమాల్లో పాటలు పాడారాయన. అయితే ఇప్పుడు తొలిసారి రెహమాన్‌ సంగీతంలో పాడారు ధనుష్‌. అది కూడా హిందీ సినిమాకి. ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో ధనుష్‌ ఓ హిందీ సినిమా చేస్తున్నారు.

‘అత్రంగీ రే’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్, సారా అలీఖాన్, ధనుష్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఓ పాటను ధనుష్‌ పాడారు. ఆ పాటకు సంబంధించిన రికార్డింగ్‌ ఇటీవలే పూర్తయింది. ‘‘రెహమాన్‌ సార్‌ మ్యూజిక్‌లో పాడటం ఓ అద్భుతమైన అనుభవం. ఈ జ్ఞాపకం ఎప్పటికీ మిగిలిపోతుంది’’ అన్నారు ధనుష్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు