Maaran Movie: జర్నలిస్ట్​గా ధనుష్.. ఆకట్టుకుంటున్న 'మారన్'​ ట్రైలర్​​ ​

28 Feb, 2022 17:38 IST|Sakshi

Dhanush Starrer Maaran Movie Trailer Released: తమిళ స్టార్​ హీరో ధనుష్ తనదైన విలక్షణమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల హిందీలో ఆనంద్​ ఎల్ రాయ్​ దర్శకత్వంలో ఆత్రంగి రే చిత్రంతో అలరించిన ధనుష్​ తాజాగా నటించిన మూవీ మారన్​. కార్తీక్​ నరేన్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అర్జున్​ త్యాగరాజన్​ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో ధనుష్​కు సరసన మాళవికా మోహనన్​​ నటిస్తుండగా జీవీ ప్రకాష్​ కుమార్​ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, సాంగ్స్, టీజర్​లు ఇప్పటికే అలరించగా మూవీపై అంచనాలు పెంచాయి. 

తాజాగా మారన్​ సినిమా తెలుగు​ ట్రైలర్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ తెలుగు విడుదల చేసింది. ఈ చిత్రం మార్చి 11 నుంచి నేరుగా డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్​ విషయానికస్తే ధనుష్​ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నాడు. జర్నలిజం నేపథ్యంలో యాక్షన్​ ఎంటర్​టైనర్​గా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ధనుష్​ జర్నలిస్ట్​గా కనిపించనన్నట్లు ట్రైలర్​ చూస్తే అర్థమవుతోంది. అలాగే ధనుష్​, మాళవిక మోహనన్​ల మధ్య రొమాంటిక్​ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు