ఢీకి రెడీ అవుతున్నారా?

21 Nov, 2020 02:00 IST|Sakshi

మంచు విష్ణు కెరీర్‌లో ‘ఢీ’ సినిమాది ప్రత్యేకమైన స్థానం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్‌ తదితరులు నటించారు. 2007లో విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా  విష్ణు చేసిన ట్వీట్‌ ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

‘ఢీ’ విడుదల తేదీ పోస్టర్‌ని పోస్ట్‌ చేసిన విష్ణు ఈ నెల 23న ఓ ఎగ్జయిటింగ్‌ అప్‌డేట్‌ ఇవ్వబోతున్నాం అని ట్వీట్‌ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘కొన్ని వేల మంది సినీప్రియుల అభిమాన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క నటుడికీ ఇదొక గేమ్‌ చేంజర్‌. ఆ రోజుల్లో సినిమాకి సంబంధించిన కొత్త ఒరవడికి ‘ఢీ’ శ్రీకారం చుట్టింది.‘ఢీ’ కంటే బెటర్‌ ఏం ఉంటుంది?’ అని ట్వీట్‌ చేశారు విష్ణు. తాజాగా శ్రీనువైట్లతో డీ&డీ సినిమా చేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. బిగ్‌ బ్రదర్‌ శ్రీను వైట్లతో మరోసారి పనిచేయడం ఆసక్తిగా ఉందని, డబుల్‌ డోస్‌తో ఈ సినిమా రాబోతుందని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు