జూనియ‌ర్ స‌ర్జాకు విలువైన బ‌హుమ‌తి

20 Oct, 2020 19:46 IST|Sakshi

క‌న్న‌డ న‌టుడు చిరంజీవి స‌ర్జా, మేఘ‌నా రాజ్ బిడ్డ త్వ‌ర‌లోనే ఈ లోకానికి రానుంది. దీంతో చిరంజీవి సోద‌రుడు ధ్రువ సర్జా పండంటి బిడ్డ కోసం వెండితో త‌యారైన ఊయ‌ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. 10 ల‌క్ష‌ల విలువైన ఈ ఊయ‌ల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  కాగా సీనియర్‌ హీరో అర్జున్‌ మేనల్లుడు, నటుడు అయిన చిరంజీవి సర్జా జూన్‌ 7న బెంగళూరులో మరణించిన విషయం విదితమే. 36 వయస్సులోనే గుండెపోటుతో ఆయన కన్నుమూయడం అందరినీ తీవ్ర వేదనకు గురిచేసింది. 2018లో చిరంజీవి సర్జా, కథానాయిక మేఘనా రాజ్‌ పెళ్లి చేసుకున్నారు. మరణించే నాటికే అతడి భార్య గర్భవతి. ఈ క్రమంలో చిరంజీవి సర్జా సతీమణి మేఘన సీమంతం వేడుక ఇటీవ‌లె  ఘనంగా జరిగింది. (నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: మేఘనా రాజ్‌ )

భర్త జ్ఞాపకాలతో బ్రతుకుతున్న మేఘన చిరంజీవి స్టైల్‌గా నుంచున్నట్లు కటౌట్ తయారుచేయించి తన కుర్చీ పక్కనే పెట్టుకున్నారు. దూరం నుంచి చూస్తే చిరంజీవి నిజంగానే భార్య పక్కను నిలబడినట్లు ఉండటంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ‘చిరంజీవి కటౌట్‌ చూస్తుంటే‌ ఆయన నిజంగా వేడుకలో ఉన్నట్లే ఉంది’, ‘మేడమ్ మీకు అంతా మంచే జరగాలి. అలాగే మీరు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నాం’ అని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. (మేఘనా సర్జా సీమంతం వేడుక)

@chirusarja @megsraj @arjunsarjaa @shankar.prerana @surajsarjaofficial @aishwaryaarjun @anj204 @classycaptures_official jai hanuman 🙂👍

A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు