Dhruva Sarja-Pushpa Raj: పుష్పరాజ్‌ రిలీజ్‌ ఎప్పుడంటే?

4 Aug, 2022 19:16 IST|Sakshi

రియల్ ఎస్టేట్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు బొడ్డు అశోక్. సినిమారంగంలో కూడా తన సత్తా చాటుకోవడానికి నిర్మాతగా మారాడాయన. ధ్రువ సర్జా, రచిత రామ్ హరిప్రియ జంటగా కన్నడలో రూపొందిన 'పుష్పరాజ్: ది సోల్జర్' చిత్రాన్ని ఆర్.యస్ ప్రొడక్షన్స్ ఆర్.శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వి సినిమాస్ పతాకాలపై తెలుగులోకి అనువదిస్తున్నారు. ఆగస్టు 19న సినిమా రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత బొడ్డు అశోక్  మాట్లాడుతూ.. 'భార్జరీ  సినిమా ద్వారా కన్నడ రంగంలో అడుగుపెట్టాడు అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా. ఈయన  హీరోగా కన్నడలో రూపొందిన 'పుష్పరాజ్ ది సోల్జర్'  చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. ధ్రువ సర్జా సరసన అందాల తార రచితా రామ్ హరిప్రియ హీరోయిన్ గా నటించింది. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి.

అల్లు అర్జున్ గారు నటించిన "పుష్ప"  సినిమాతో పుష్పరాజ్ పేరు ఎంతో ఫేమస్ అయ్యింది. ఎప్పుడైతే ఈ టైటిల్ పెట్టామో మా సినిమాకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా నాకు నిర్మాతగా మంచి పేరు తెస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. ప్రతి రంగంలో సక్సెస్ అయ్యే నేను సినిమా రంగంలో కూడా నిర్మాతగా సక్సెస్ అవుతానన్న నమ్మకంతో ఉన్నాను. తెలుగులో అర్జున్ చిత్రాలు ఎలాగైతే ఆదరించారో.. ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్మకం ఉంది' అన్నారు.

చదవండి: జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒక లెజెండ్‌, ఆ ఛాన్స్‌ వస్తే బాగుండు
అతడు డ్రగ్స్‌ తీసుకోవడం కళ్లారా చూశా.. హీరో మాజీ ప్రేయసి

మరిన్ని వార్తలు