మరోసారి పెళ్లి పీటలు ఎక్కనున్న ప్రముఖ నటి

13 Feb, 2021 13:30 IST|Sakshi

ప్రముఖ నటి, బాలీవుడ్‌ బ్యూటీ దియా మిర్జా మరోసారి పెళ్లి పీటలు ఎక్కుబోతున్నారు. బాయ్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న ముంబైకి చెందిన వ్యాపావేత్త వైభవ్‌ రేఖీతో ఫిబ్రవరి 15న(సోమవారం) దియా ఏడడుగులు వేయనున్నారు. కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రుల సమక్షలో వీరి వివాహ వేడుక జరగనుంది. కాగా గతేడాది నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దియా ఇదివరకే నిర్మాత సాహిల్‌ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011 నుంచి సహజీవనంలో ఉన్న వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకోగా  కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. 2019లో తమ అయిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు

ఇక భర్తతో విడాకుల అనంతరం దియా వ్యాపారవేత్త అయిన వైభవ్‌ రేఖీతో ప్రేమలో ఉన్నట్లు గతేడాది గుసగుసలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో దియా-వైభవ్‌లు‌ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇక వీరి పెళ్లికి కూడా ఇరువురి కుటుంబాలు అంగీకారం తెలపడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. కాగా దియా ప్రస్తుతం  తెలుగులో ‘వైల్డ్‌ డాగ్’‌ మూవీలో నటిస్తున్నారు. చివరిగా ఆమె దర్శకుడు అనుభవ్‌ సిన్హా రూపొందించిన ‘థప్పడ్‌’లో నటించారు. ఇందులో తాప్పీ లీడ్‌ రోల్‌ పోషించగా దియా సామాజిక కార్యకర్తగా, మహిళ సంఘ నాయకురాలి పాత్రలో కనిపించారు.

(చదవండి: అసభ్య వ్యాఖ్యలు.. ట్రోలర్స్‌కు దీపిక చురకలు)
               (కేబుల్‌ వైర్లతో కట్టేసి కొరడాతో కొట్టేవాడు..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు