గుడ్‌న్యూస్‌ పంచుకున్న ‘వైల్డ్‌ డాగ్‌’ నటి‌

2 Apr, 2021 09:42 IST|Sakshi

అదృష్టం... తల్లిని కాబోతున్నా:  దియా మీర్జా

సాక్షి,ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటి దియా మీర్జా  ఒక తీపికబురు తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోముంబైకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీని వివాహం చేసుకున్న దియా తను తల్లి కాబోతున్నానన్న విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా అద్భుతమైన ఫోటోను గురువారం ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.  భర్త వైభవ్ రేఖీతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్న ఆమె తన ప్రెగ్నెన్సీ కబురును  అందించారు. అందమైన సూర్యాస్తమయంలో కడుపులోని బిడ్డను అదుముకుంటూ, తల్లి కాబోతున్న అనుభూతిని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక భావోద్వేగ కవిత పోస్ట్‌ చేశారు. దీంతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్,  షిబాని దండేకర్, తాహిరా కశ్యప్, మహీప్ కపూర్, అనుష్క శర్మ, ప్రియాంక  చోప్రా తదితరులతోపాటు అభిమానులనుంచి  కూడా దియాకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఇప్పటికే మిలియన్ల లైక్‌లను ఈ పోస్ట్‌ సొంతం చేసుకోవడం విశేషం.

కాగా మొదటి భర్త సాహిల్ సంఘాతో 11 సంవత్సరాల వివాహం బంధానికి స్వస్తి చెప్పి  2019 లో విడిపోయారు  దియా. అనంతరం బిజినెస్‌మే న్‌ వైభవ్ రేఖీని ఈ ఏడాది ఫిబ్రవరి 15 న వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన దియా ఈ ఫోలోను షేర్ చేశారు. తాజాగా ‘వైల్డ్ డాగ్’ సినిమాతో అక్కినేని నాగర్జునకు జోడీగా దియా మీర్జా నటించిన సంగతి తెలిసిందే. (అత్యున్నత పురస్కారం: తలైవా భావోద్వేగం)

A post shared by Dia Mirza (@diamirzaofficial)

మరిన్ని వార్తలు