రెండో వివాహం.. ట్రెండ్‌ సెట్‌ చేసిన నటి

17 Feb, 2021 17:11 IST|Sakshi
నూతన దంపతులు దియా మీర్జా-వైభవ్‌ రేఖి

‘పురోహితురాలి’ చేతుల మీదుగా వివాహ వేడుక

దియా మీర్జాపై ప్రశంసలు కురిపిస్తోన్న నెటిజనులు

సాధారణంగా, ఆలయాల్లో పూజలు, వివాహం, వ్రతం, యాగాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే పూజారి తప్పనిసరి. ఒకప్పుడు ఈ కార్యక్రమాలను కేవలం బ్రాహ్మణులు మాత్రమే నిర్వహించే వారు. కానీ ప్రస్తుతం అక్కడక్కడ కొందరు ఇతర సామాజిక వర్గాల వారు కూడా పౌరోహిత్యం చేస్తున్నారు. అయితే ఎక్కడైనా ఈ విధులు నిర్వహించే వారే పురుషులే. పౌరోహిత్యం చేసే స్త్రీలు చాలా అరుదు.

ఈ క్రమంలో రెండో వివాహం చేసుకున్న ప్రముఖ బాలీవుడ్‌ నటి దియా మీర్జా నయా ట్రెండ్‌ సెట్‌ చేశారు. పురోహితురాలి చేతుల మీదుగా తన వివాహ వేడుక జరుపుకున్నారు. మీరు చదివింది నిజమే.. పురోహితుడు కాదు.. పురోహితురాలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతుంది. 

దియా ఇది వరకే నిర్మాత సాహిల్‌ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2014లో వివాహం చేసుకోగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. 2019లో తమ అయిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ఇక భర్తతో విడాకుల అనంతరం దియా, వ్యాపారవేత్త అయిన వైభవ్‌ రేఖీని ఈ నెల 15న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహ వేడుక ‘పురోహితురాలి’ చేతుల మీదుగా జరిగింది. ఇందుకు సంబందించిన ఫోటోని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు దియా మీర్జా.

‘‘మా వివాహం జరిపించినందుకు ధన్యవాదాలు షీలా అట్టా.. ‘అందరం కలిసి ఎదుగుదాం’’.. ‘‘జనరేషన్‌ ఈక్వాలిటీ’’’’ అనే హాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దియా మీర్జా ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజనులు. ‘‘పితృస్వామ్య వ్యవస్థని నాశనం చేయండి’’.. ‘‘ఈ మహిళ ఎంతో దీక్షగా, శ్రద్ధగా వివాహ తంతు జరిపించి ఉంటుందని నేను నమ్ముతున్నాను’’.. ‘‘వారిని ఎదగనివ్వండి’’.. ‘‘మహిళాసాధికరతకు నిదర్శనం’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. 

చదవండి: ఈ పని మగవాళ్లే ఎందుకు చేయాలి?
                   ప్రధానమంత్రి పెళ్లి మూడోసారి వాయిదా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు