‘దియా’ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది : హీరో దీక్షిత్‌

17 Aug, 2021 16:25 IST|Sakshi

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా దియా. కె.ఎస్.ఎస్ అశోక్ దర్శకత్వం వహించిన ఈ ట్రైయాంగిల్ ప్రేమకథ.. అక్కడ సూపర్ హిట్‏గా నిలిచింది. ఇందులో ఖుషీ రవి, పృథ్వీ అంబర్, దీక్షిత్ శెట్టి అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమాను తెలుగులోకి తీసుకురావడానికి చాలా రోజులుగా మేకర్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ఘ నీరిక్షణ అనంతరం ఎట్టకేలకు ఈ మూవీ తెలుగులో రాబోతుంది.
(చదవండి: Afghanistan: అధ్యక్ష భవనంలో తాలిబన్ల తీరుపై వర్మ షాకింగ్‌ కామెంట్‌)

అదే పేరుతో  ఫణి శ్రీ పరుచూరి ప్రజెంట్స్ లో  క్లాప్ బోర్డ్స్  ప్రొడక్షన్స్ , విభ  కశ్యప్ ప్రొడక్షన్స్ పతాకాలపై  ఆర్కే నల్లం ,రవి కశ్యప్ లు  సంయుక్తంగా కలసి తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను అందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్‌ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించింది. 

ఈ సందర్బంగా హీరో దీక్షిత్‌ మాట్లాడుతూ.. ‘కన్నడ ప్రేక్షకులకు నచ్చినట్లే తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ నెల 19 న  విడుదల అవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి మమ్మల్ని మాటీం ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం’ అన్నారు.  ఒక  డెస్టినీ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల మధ్య  ప్రేమని ఎలా మార్చింది అనే కాన్సెప్టు తో వస్తున్న ‘దియా’తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు కో డైరెక్టర్‌ గోపి. ఈ సినిమాకి బి. ఆజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. 

మరిన్ని వార్తలు