Aditi Shankar : ఆ యువ నటి శంకర్‌ కూతురిని టార్గెట్‌ చేసిందా? ఆ ట్వీట్‌ అర్థమేంటి!

8 Aug, 2022 18:35 IST|Sakshi

నెపోటిజం(బంధుప్రీతి) ఈ పేరు వినగానే మొదట గుర్తోచ్చేది బాలీవుడ్‌. దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ మరణానంతరం బాలీవుడ్‌లో నెపోటిజంపై ఎంతటి దూమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా బాలీవుడ్‌లో వినిపించే ఈ పేరు ఇప్పుడు దక్షిణాదిలో సైతం వినిపిస్తోంది. తాజాగా యువ నటి చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. సౌత్‌లో సైతం నెపోటిజం ఎఫెక్ట్‌ ఉన్నా ఇప్పటివరకు దీనిపై మాట్లాడే సాహసం ఎవరు చేయలేదు. తాజాగా ఈ యంగ్‌ బ్యూటీ ధైర్యం చేసి ఈ అంశాన్ని లెవనెత్తినట్లు కనిపిస్తోంది. ‘సౌకర్యం ఉన్నవాళ్లు నిచ్చెన ఎక్కేసి సులువైన మార్గంలో పైకి వెళ్లడం చూస్తే చాలా బాగుంటుంది కదా. మరి మిగతావాళ్ల సంగతేంటి’ అంటూ ఆమె ట్వీట్‌ చేసింది.

చదవండి: క్రేజీ ఆఫర్‌.. మహేశ్‌-త్రివిక్రమ్‌లో చిత్రంలో వేణు?

ఆమె ట్వీట్‌ చూస్తుంటే సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కూతురు అదితి శంకర్‌ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కోలీవుడ్‌ బంధుప్రీతిపై తొలిసారి నోరు విప్పిన ఈ బ్యూటీ పెద్ద స్టార్‌ ఏమీ కాదు. ఈమధ్యే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఓ యువ నటి. ఇప్పటి వరకు ఆమె చేసింది ఒకట్రెండు సినిమాలు మాత్రమే. ఇంతకి ఈ బ్యూటీ పేరు ఏంటంటే ఆత్మిక. ‘మిసాయి మురుకు’ అనే తమిళ చిత్రంతో ఆమె కోలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ మూవీ మంచి విజయం సాధించినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆత్మికకు ప్రస్తుతం ఆఫర్లు కరువయ్యాయి. దీంతో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆత్మిక తరచూ  సోషల్‌ మీడియాలో తన హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

చదవండి: లోకేశ్‌ కనకరాజు-విజయ్‌ చిత్రం, ‘విక్రమ్‌’ను మించిన స్క్రిప్ట్‌! అదిరిపోయిందిగా..

ఈ నేపథ్యంలో ఇటీవలే నటిగా తెరంగేట్రం చేసిన డైరెక్టర్‌ శంకర్‌ కూతురు అదితి శంకర్‌కు పరోక్షంగా ఆమె చురకలు వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అదితి.. స్టార్‌ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటోంది. అంతేకాదు సింగర్‌గా కూడా రాణిస్తోంది. ఆమె నటించింది ఒకటే సినిమా అయిన ఆ వెంటనే పెద్దపెద్ద ఆఫర్లు రావడంతో ఆత్మికకు కన్ను కుట్టినట్లు ఉందని, అందుకే పరోక్షంగా ఆమెను టార్గెట్‌ చేసి ఈ ట్వీట్‌ చేసిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఆత్మిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. కాగా అదితి ఇప్పటికే హీరో కార్తి సరసన హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేయగా.. తాజాగా ఆమె శివ కార్తికేయన్‌ సినిమాలో మరో క్రేజీ ఆఫర్‌ అందుకుంది. 

మరిన్ని వార్తలు