నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్‌ ఏంటంటే..

9 Jun, 2021 13:46 IST|Sakshi

'పెళ్లిచూపులు' సినిమాలో 'నా సావు నేను చస్తా నీకెందుకు' అంటూ ఒక్క డైలాగ్‌తో క్రేజ్‌ సంపాదిచుకున్న నటుడు ప్రియదర్శి. అంతకుముందే కొన్ని సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ పెళ్లిచూపులు సినిమాలో తెలంగాణ యాసలో ప్రియదర్శి  చెప్పిన డైలాగులు బాగా పాపులర్‌ అవడంతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత  జై లవకుశ, స్పైడర్ సినిమాల్లోనూ తన పాత్ర మేరకు ఆకట్టుకున్నాడు. అయితే 2019లో వచ్చిన 'మల్లేశం' సినిమాలో లీడ్‌ రోల్‌ పోషించి సత్తా చాటుకున్నాడు. ఎమోషనల్‌గానూ ఆకట్టుకున్నాడు. ఇక ఈ మధ్యే వచ్చిన 'జాతిరత్నాలు' సినిమాలోనూ తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు.

ఈతరం కమెడియన్స్‌లో ప్రియదర్శికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ప్రియదర్శి ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి అందరికి తెలిసినా ఆయన వ్యక్తిగత విషయాలు మాత్రం చాలా మందికి తెలియదు. రిచా శర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియదర్శి.. తనకు ఫ్యామిలీ సపోర్ట్‌ చాలా ఉందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. గతంలో ఆడిషన్స్‌కు వెళ్లేటప్పుడు బట్టలు కొనుక్కోడానికి తన భార్య రిచానే డబ్బులు ఇచ్చేదని, అంతేకాకుండా తన మొబైల్‌, ట్రావెల్‌ ఖర్చులు కూడా ఆమే కట్టేదని పేర్కొన్నాడు.

ప్రియదర్శి భార్య  రిచా శర్మ నవలా రచయిత్రి. ఇప్పటికే ఆమె పలు నవలలు రాసినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రియదర్శి నాన్నపులికొండ సుబ్బచారి ప్రొఫెసర్‌గా పనిచేశారట. ఆయన పలు పద్యాలు, కవితలు కూడా రాసేవారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా..ప్రస్తుతం ప్రియదర్శి ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. ఎప్పుడూ కామెడీ పండించే పాత్రలు ఎంచుకునే అతడు ఈసారి మాత్రం క్రైమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ ది గాడ్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 

చదవండి : 'ఆట ఫేమ్‌ గీతిక ఎన్ని కష్టాలు పడుతుందో'.. ఆమె ఏం చెప్పిందంటే!
'దమ్ము' హీరోయిన్‌ కార్తీక ఏం చేస్తుందో తెలుసా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు