'సంతోషం'లో నటించిన ఈ బుడ్డోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

14 Jun, 2021 13:06 IST|Sakshi

నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమా అప్పట్లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 2002లో వచ్చిన ఈ సినిమాలో నాగార్జునకు జంటగా శ్రియా సరన్‌ నటించింది. మ్యూజికల్‌గానూ ఈ సినిమా సూపర్‌ సక్సెస్‌ అయింది. ఇక ఈ సినిమాలో నాగార్జున కొడుకుగా నటించిన బుడ్డోడు గుర్తున్నాడా? పెద్ద కళ్లద్దాలతో ఎంతో క్యూట్‌గా అలరించిన ఆ బుడతడి పేరు అక్షయ్‌ బుచ్చు. ఓ బాలీవుడ్‌ చిత్రంలో అక్షయ్‌ యాక్టింగ్‌ చూసి ఫిదా అయిన నాగార్జున సంతోషం సినిమాలో ఛాన్స్‌ ఇప్పిచ్చాడట. ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో ప్రభాస్‌, త్రిష నటించిన వర్షం సినిమాలోనూ నటించాడు.

సంతోషం సినిమా టైంకి అక్షయ్‌ వయస్సు కేవలం ఆరు సంవత్సరాలేనట. అంతకుముందే పలు సినిమాల్లో నటించినా అక్షయ్‌కు అంతగా గుర్తింపు రాలేదు. కానీ సంతోషం హిట్‌తో అక్షయ్‌కు మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఆ తర్వాత ఎందుకో కానీ టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసి బాలీవుడ్‌లోనే సెటిల్‌ అయిపోడారు. అక్కడ పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. అంతేకాకుండా దాదాపు 45 యాడ్‌ ఫిల్మ్స్‌లోనూ నటించి మరింత పాపులర్‌ అయ్యాడు.

తర్వాత కొద్దికాలం యాక్టింగ్‌ కెరీర్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్న అక్షయ్‌.. ప్రస్తుతం సింగర్‌గా అలరిస్తున్నాడు. అడపాదడపా సినిమాలు చేస్తూనే మరోవైపు  సింగర్‌గానూ అలరిస్తున్నాడు. ఇప్పటికే పలు హిందీ పాటలు పాడుతూ తనదైన స్టైల్‌లో ఆకట్టుకుంటున్నాడు. సాంగ్స్‌ పాడుతూ ఎప్పటికప్పుడు ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తున్నాడు.
 

చదవండి : 'డాడీ' మూవీ చిన్నారి ఇప్పుడు ఎక్కడుందంటే...
బుల్లితెరపై శివగామిలా అదరగొడుతున్న రాశీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?


 

మరిన్ని వార్తలు