Amitabh Bachchan: కాళ్లతో అమితాబ్‌ పెయింటింగ్‌ వేసిన అభిమాని.. నెటిజన్లు ఫిదా

27 Sep, 2021 11:27 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌కి ఉన్న ఫ్యాన్‌ పాలోయింగ్‌ తెలిసిందే. ఎందరో ఆయన అభిమానులు రకరకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. అయితే దివ్యాంగుడైన ఓ వ్యక్తి వేసిన పెయింటింగ్‌కి లెజెండ్‌ యాక్టర్‌తోపాటు నెటిజన్ల ఫిదా అవుతున్నారు.

ఆ పెయింటింగ్‌ని అమితాబ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. అందులో ఆ యువకుడు ‘గులాబో సితాబో’ సినిమా నుంచి ఆయన లుక్‌ని గీశాడు. అయితే అది చేతులతో కాదు కాళ్లతో. అతని పేరు ఆయుష్‌ అని, చేతులు ఉపయోగించలేడు కానీ కాళ్లతో అద్భుతమైన పెయింటింగ్‌ వేయగల ప్రత్యేక సామర్థ్యం ఉన్నవాడని ఈ లెజెండ్‌ యాక్టర్‌ తెలిపాడు.

ఆయుష్‌ని స్వయంగా కలిసిన బిగ్‌బీ, బొమ్మల్ని గీసే విధానం తెలుసుకొని, తనకు బహుమతిగా పెయింటింగ్‌ ఇచ్చినందుకు ఆ యువకుడికి కృతజ్ఞతలు తెలిపాడట. కాగా ప్రస్తుతం ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షోకి హోస్ట్‌ చేస్తున్న అమితాబ్‌ ‘ది ఇంటర్న్‌’, ‘బ్రహ్మస్త్ర’, ‘మేడే’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.

చదవండి: వెంటనే ఆ యాడ్‌ నుంచి తప్పుకోండి అమితాబ్‌: నాటో అధ్యక్షుడు లేఖ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు