‘బిగ్‌బాస్‌’ బ్యూటీపై నెమలి దాడి.. వీడియో వైరల్

11 Apr, 2021 19:38 IST|Sakshi

‘బిగ్‌బాస్‌’బ్యూటీ, బాలీవుడ్‌ టీవి నటి దిగంగన సూర్యవంశిపై నెమలి దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వీడియో ప్రకారం ఒక అందమైన నెమలి దగ్గరకు దిగంగన వెళ్లింది. అది అలాగే చూస్తూ ఉండడంతో నవ్వుతూ మరింత దగ్గరకు వెళ్లింది. నెమలి మెల్లిగా ముందుకు వచ్చి అకస్మాత్తుగా దిగంగనపై దాడిచేసింది. దీంతో భయానికి లోనైన దిగంగన.. గట్టిగా అరుస్తూ చేతులతో నెమలిని కిందికి తోసేసింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అయింది.

బాలీవుడ్‌లో పలు సీరియళ్లలో నటించిన దిగంగన..‘ఏక్ వీర్ కి అర్దాస్ ... వీరా’తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ సిరియల్‌ వల్లే..హిందీ బిగ్‌బాస్‌-9లోకి వెళ్లింది. అనంతరం పలు సినిమాల్లో నటించిది. తెలుగులో యువహీరో కార్తికేయతో కలిసి ‘హిప్పీ’సినిమాలో నటించింది. ప్రస్తుతం గోపిచంద్‌ హీరోగా నటిస్తున్న సీటీమార్‌ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే.  
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

>
మరిన్ని వార్తలు