దిల్‌ రాజు బర్త్‌డే మామూలుగా లేదుగా..!

18 Dec, 2020 11:13 IST|Sakshi

టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల్లో ఒకరుగా కొనసాగతున్న దిల్‌ రాజు నేడు(డిసెంబర్‌ 18) 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టిన రోజును పురస్కరించుకొని ముందు రోజు రాత్రి(గురువారం) టాలీవుడ్‌ ప్రముఖులకు దిల్‌రాజు గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. వేడుకగా నిర్వహించిన ఈ పార్టీలో టాలీవుడ్‌ తారలతోపాటు సౌత్‌ ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. ఈ పార్టీకి దిల్‌ రాజు భార్య తేజస్విని ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ ఏడాది మేలో దిల్‌ రాజు రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన భార్య తేజస్వినిని ఇండస్ట్రీ మిత్రులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో దిల్‌ రాజు ఈ వేడుక ఘనంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చదవండి: షాకింగ్‌ లుక్‌లో పవన్‌ భార్య.. గుర్తుపట్టారా!

హైదరాబాద్‌లో‌ నిర్వహించిన ఈ పార్టీలో అగ్ర హీరోల నుంచి హీరోయిన్ల వరకు సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, మహేష్‌ బాబు, పవన్‌ కల్యాన్‌, రామ్‌చరణ్‌, ప్రబాస్‌, వరుణ్‌ తేజ్‌, విజయ్‌ దేవరకొండ, రాక్‌స్టార్‌ యశ్‌, కేజీఎఫ్‌ చిత్ర యూనిట్‌, రామ్‌ పోతినేని, బెల్లంకొండ సురేష్‌  మెరిశారు. అదే విధంగా అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, అనుపమ పరమేశ్వరణ్‌, నివేదా పేతురాజ్‌ తమ బ్యూటిఫుల్‌ అందాలతో కనువిందు చేశారు. మరోవైపు సెలబ్రిటీ కపూల్స్‌, సమంత- చైతన్య, నితిన్‌ తన భార్యతో కలిసి రావడం విశేషంగా నిలిచింది. వీరంతా ‘దిల్‌ రాజు 50’ అనే బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పార్టీకి చెందిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: దిల్ రాజు కీల‌క నిర్ణ‌యం

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు