దిల్‌ రాజుతో టాప్‌ హీరోలు.. ఫోటోలు వైరల్‌

18 Dec, 2020 17:30 IST|Sakshi

దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న దిల్‌ రాజు 50వ పుట్టిన రోజు నేడు(డిసెంబర్‌ 18). ఈ సందర్భంగా దిల్‌రాజ్‌కు సినీ ప్రముఖులను నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టిన రోజును పురస్కరించుకొని ముందు రోజు రాత్రి  టాలీవుడ్‌ ప్రముఖులకు దిల్‌రాజు గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీస్‌తో పాటు తనకు పరిచయం ఉన్న స్టార్స్ అందరిని పిలిచాడు. అందులో కన్నడ సూపర్ స్టార్ యశ్‌తో పాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు దిల్ రాజు పార్టీకి వచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదిలాఉంటే దిల్‌రాజుతో మహేశ్‌ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాగచైతన్య, రామ్‌, విజయదేవరకొండ కలిసి ఫోటో దిగారు. ప్రస్తుతం ఆ ఫోటోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్ర హీరోలందరిని ఒకే ఫ్రేమ్‌లో అభిమానులు ఫిదా అవుతున్నారు.

అలాగే రామ్‌ చరణ్‌, ప్రభాస్‌ కూడా ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఈ ఫోటోలు చూసి అటు ప్రభాస్.. ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరు హీరోలతో దిల్ రాజు హిట్‌ సినిమాలు నిర్మించాడు. ప్రభాస్‌తో చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ అయింది. దాంతో పాటు చరణ్‌తో నిర్మించిన ఎవడు కమర్షియల్ సక్సెస్ సాధించింది.వీరిద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా మారడంతో ఈ పిక్ కు మరింత క్రేజ్ వచ్చింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు