Dill Raju: ఆ విషయంలో అందరు నన్ను నిందిస్తున్నారు

19 May, 2022 16:35 IST|Sakshi

కోవిడ్‌ అనంతరం పెద్ద సినిమాల టికెట్ల రెట్స్‌ను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. అయితే మే 27న రిలీజ్‌ కాబోతోన్న విక్టరి వెంకటేశ్, మెగా హీరో వరుణ్‌ తేజ్‌ సినిమా ఎఫ్‌ 3కి మాత్రం టికెట్‌ రెట్స్‌ పెంచడం లేదని దిల్‌ రాజు స్పష్టం చేశారు. దీంతో ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చారు. త్వరలో ఎఫ్‌ 3 మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు.

చదవండి: ఆ సీన్స్‌తో మళ్లీ రిలీజవుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజీయఫ్‌ 2, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి భారీ బడ్జెట్‌ చిత్రాలకు టికెట్‌ రెట్స్‌ పెంచడంలో తప్పులేదని, అయితే ఇది అన్ని సినిమాలకు వర్క్‌ కాదన్నారు. ‘కోవిడ్‌ సమయంలో సినిమా షూటింగ్‌ వాయిదా పడటం వల్ల బడ్జెట్‌ మరింత పెరిగింది. మరోవైపు అదే సమయంలో ప్రతి ఒక్కరు ఇంట్లోనే సినిమాల చూడటం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయారు. అయితే టికెట్‌ రెట్స్‌ పెంచడం వల్ల పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందొచ్చు. కానీ, అదే సమయంలో మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలు థియేటర్లకు వచ్చేందుకు ధైర్యం చేయలేదనే విషయాన్ని గమనించాను.

చదవండి: తెలుగు ఫిలిం చాంబర్‌పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు

అంతేకాదు రెండు నుంచి మూడు సార్లు సినిమా చూసే ప్రేక్షకులు కూడా ఒక్కసారి మాత్రమే థియేటర్‌కు వచ్చారు’ అని ఆయన అన్నారు. అయితే కోవిడ్‌ అనంతరం టికెట్‌ రెట్స్‌ పెరగడంపై ప్రతి ఒక్కరు తనని నిందిస్తున్నారని దిల్‌ రాజు అన్నారు. ఇది ప్రొడ్యూసర్స్‌తో పాటు హీరోలు కలిసి తీసుకున్న నిర్ణయమని, వారందరి తరపున తాను ఇన్సియేషన్‌ తీసుకున్నానే విషయం ప్రతి ఒక్కరు గమనించాలన్నాడు. అయితే తాను మాత్రం తన సినిమాను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే థియేటర్లోకి తీసుకువస్తున్నానని ఆయన వివరణ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు