చర్చలు జరుగుతున్నాయి..త్వరలోనే నిర్ణయాలు తెలియజేస్తాం: దిల్‌ రాజు

25 Jun, 2022 12:15 IST|Sakshi

సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై ఫిలిం ఫెడరేషన్‌ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించామని, వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. కార్మికుల వేతనాల సమస్యపై ఏర్పాటైన కమిటీకి అధ్యక్షత వహిస్తున్న దిల్‌ రాజు శుక్రవారం తెలుగు ఫిలించాంబర్‌, తెలుగు ఫిలిం ఫెడరేషన్‌ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ చర్చలు వరుసగా జరుగుతాయని, ఏ రోజుకారోజు చర్చల తర్వాత అన్నీ క్రోడికరించి చివరి రోజున మీడియా ద్వారా నిర్ణయాలను తెలియజేస్తామని చెప్పారు. శుక్రవారం నుంచి అని సినిమా షూటింగ్‌లు ప్రారంభమయ్యాయన్నారు. కార్మికుల ప్రతీ సమస్య గురించి చర్చిస్తామని ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు