మంచి సినిమాలను ప్రోత్సహించాలి

12 Sep, 2023 03:59 IST|Sakshi

– ‘దిల్‌’ రాజు

‘‘తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారని ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’తో మరోసారి నిరూపించారు. ఇలాంటి మంచి సినిమాలను అందరూప్రోత్సహించాలి. ‘జవాన్‌’ విడుదలైన రోజే వచ్చిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ నిలబడి, బలమైన వసూళ్లతో ముందుకెళ్తోంది’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు.

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పి. మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘మా చిత్రాన్ని చిరంజీవి, మహేశ్‌బాబు, రవితేజ, రాజమౌళి, వంశీ పైడిపల్లి సమంత అభినందించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘త్వరలో సక్సెస్‌ సెలబ్రేషన్స్, సక్సెస్‌ టూర్‌ ΄్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు ప్రమోద్‌. 

మరిన్ని వార్తలు