ఆ నిర్మాతలను అనుసరించాను : దిల్‌ రాజు

27 Jul, 2021 08:45 IST|Sakshi

‘‘రామానాయుడుగారు, ఆర్‌బీ చౌదరిగారు.. ఇలా కథల మీద మంచి పట్టు ఉన్న ప్రొడ్యూసర్స్‌ని స్టడీ చేసి, నా ప్రతి సినిమాకు దాన్ని అడాప్ట్‌ చేసుకున్నాను. అలాంటి సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌లో వస్తోన్న ‘ఇష్క్‌’ని  ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. తేజా సజ్జ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా యస్‌.యస్‌. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్‌’. ఆర్‌బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్‌ జైన్, వాకాడ అంజన్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ‘దిల్‌’రాజు మాట్లాడుతూ– ‘‘కరోనా ప్రభావం ఫిలిం ఇండస్ట్రీ మీద ఎక్కువగా పడింది. థియేటర్లలో ప్రేక్షకులు మాస్కులు వేసుకునే సినిమా చూడాలి’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది.. అందరూ ఆదరించాలి’’ అన్నారు వాకాడ అప్పారావు. ‘‘కొత్త కథతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది’’ అన్నారు ఎస్‌ఎస్‌ రాజు. తేజా సజ్జ, ప్రియా ప్రకాశ్‌ పాల్గొన్నారు.


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు