ఆశిష్‌తో అలాంటీ  సినిమా చేయాలన్నాను: దిల్‌ రాజు

4 Sep, 2021 08:10 IST|Sakshi

‘‘ప్రేమదేశం, హ్యాపీ డేస్‌’ చిత్రాలు యువతను షేక్‌ చేశాయి. ఆశిష్‌తో మేం సినిమా అనుకున్నప్పుడు అలాంటి ఔట్‌ అండ్‌ ఔట్‌ కాలేజ్‌ యూత్‌ స్టోరీ కావాలని శ్రీహర్షను అడిగాను. తన కాలే జ్‌ లైఫ్‌లో జరిగిన çఘటనలతో కథ రాసుకుని, ‘రౌడీ బాయ్స్‌’ తీశాడు’’ అన్నారు ‘దిల్‌’ రాజు. నిర్మాతలు ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఫ్యామిలీ నుంచి ఆశిష్‌ రెడ్డి (శిరీష్‌ తనయుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో విక్రమ్‌ మరో హీరో.

శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్‌ అసోసియేషన్‌తో కలసి ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ‘రౌడీ బాయ్స్‌’ టైటిల్‌ సాంగ్‌ను వైజాగ్‌లో విడుదల చేశారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్‌ నాలుగేళ్ల జర్నీ ఈ చిత్రం. రెండు కాలేజీల మధ్య జరుగుతుంది. రౌడీ బాయ్స్‌ గుడ్‌ బాయ్స్‌ ఎలా అయ్యారనేదే కథ. దసరాకు సినిమాను రిలీజ్‌  చేయనున్నాం’’ అన్నారు. శ్రీహర్ష, ఆశిష్, విక్రమ్, ‘ఆదిత్య’ నిరంజన్, రోల్‌ రైడా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు