అ‍ల్లు అర్జున్‌ను దారుణంగా అవమానించిన దిల్‌ రాజు!

22 Apr, 2021 09:10 IST|Sakshi

అల్లు అర్జున్‌- దిల్‌రాజు కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారని, మూవీ మోషన్‌ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. ఈ మూవీకి 'ఐకాన్'‌ అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ను కూడా అనౌన్స్‌ చేసేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ పట్టాలెక్కలేదు. సుకుమార్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న పుష్ప మూవీలో అల్లు అర్జున్‌ నటిస్తుండగా, డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌ వకీల్‌సాబ్‌ మూవీని తెరకెక్కించడంలో బిజీ అయిపోయారు. దీంతో ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్‌ రాజ్‌ ఐకాన్‌పై వస్తున్న వార్తలపై స్పందించారు.

వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో తన తదుపరి చిత్రం ఐకాన్‌ ఉండబోతుందని, త్వరలోనే షూటింగ్‌ కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమాలో బన్నీ పాత్రపై మాత్రం ఎలాంటి కన్‌ఫర్మేషన్‌ ఇవ్వలేదు. అంతేకాకుండా స్టైలిష్‌ స్టార్‌ బన్నీకి ఐకాన్‌ స్టార్‌ అనే టైటిల్‌ను తాము పెట్టలేదని, బన్నీ తనకు తాను పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో, వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరినందువల్ల, బన్నీ ఈ సినిమాలోనటించడం లేదని ఫిల్మ్‌నగర్‌లో‌ టాక్‌ వినిపిస్తోంది. ముందు నుంచీ ఈ ప్రాజెక్టుపై బన్నీ ఆసక్తి చూపడం లేదని, అందుకే పుష్ప తర్వాత కొరటాల డైరెక్షన్‌లో మూవీ చేసేందుకు రెడీ అయిపోయాడని తెలుస్తోంది.

అయితే వకీల్‌సాబ్‌ హిట్‌తో వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో 'ఐకాన్' చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించవచ్చని దిల్ రాజు భావించడట. కానీ  వేణు శ్రీరామ్‌ని కాదని, బన్నీ ఇంకో మూవీ కమిట్‌ అవ్వడంపై దిల్‌ రాజ్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారట. అందుకే ఐకాన్‌ మూవీలో బన్నీ కాకుండా మరో హీరోతో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది. ఈ వార్తలపై మరికొద్ది  రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది.

చదవండి : 'అతని వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్‌ ఫేడ్‌ అవుట్‌ అయ్యింది'
పుష్ప: తగ్గేదే లే అంటున్న నిర్మాతలు.. ఆ సీన్‌ కోసం 40కోట్లు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు