'జాతిరత్నాలు'పై టీమిండియా క్రికెటర్‌‌ కామెంట్

16 Apr, 2021 17:58 IST|Sakshi

ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్‌ కామెడీ మూవీ ఏది? అనగానే జనాలు జాతిరత్నాలు అని టక్కున చెప్పేస్తుంటారు. థియేటర్‌కు వెళ్లి చూసిన ప్రేక్షకులు సినిమాలో భలే కామెడీ ఉందే అని నవ్వుకుంటుంటే ఓటీటీ ప్రేక్షకులు మాత్రం అబ్బే.. కంటెంట్‌ తక్కువ... కామెడీ మాత్రమే ఎక్కువ అని పెదవి విరిచారు. కానీ సెలబ్రిటీలు ఈ సినిమాకు మంచి మార్కులే వేశారు. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. తాజాగా ఈ సినిమా చూసిన భారత క్రికెటర్‌ దినేశ్‌‌ కార్తిక్‌ జాతిరత్నాలు గురించి ట్వీట్‌ చేశాడు.

'జాతిరత్నాలు.. అసలు ఏంటా కామెడీ.. ప్రతి సన్నివేశానికి పడీపడీ నవ్వుతూనే ఉన్నాను. డైలాగులు, డైరెక్షన్‌, నటన.. ఇలా ప్రతీది అద్భుతం, అమోఘం. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించడం అంటే మామూలు విషయం కాదు. కానీ మీరు దాన్ని సుసాధ్యం చేశారు..' అంటూ చిత్రయూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇది చూసిన నెటిజన్లు 'ఏంటి? నీకు తెలుగొచ్చా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా తెలుగు సినిమాను ఆదరించడం బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా నవీన్‌ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రంలో రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషించారు. అనుదీప్‌ కేవీ రూపొందించిన ఈ సినిమాను మహానటి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ నిర్మించాడు. 

చదవండి: జాతిరత్నాలు కలెక్షన్లు: నిర్మాతలకు అంత లాభమా!

‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా?

మరిన్ని వార్తలు