ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌!

7 Mar, 2021 16:44 IST|Sakshi

'సరిలేరు నీకెవ్వరు', 'ఎఫ్‌ 2' సినిమాలతో సూపర్‌ డూపర్‌ హిట్లు అందుకున్నాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. పెద్ద హీరోలతో జత కట్టే ఈయన ఒక్కో చిత్రానికి 10 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నాడని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశాడంటూ కథనాలు వినిపిస్తున్నాయి. అనిల్‌ రావిపూడి కొండాపూర్‌ సమీపంలో ఓ కాస్ట్‌లీ బంగ్లాను తన సొంతం చేసుకున్నాడట. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.12 కోట్లు ఖర్చు చేశాడంటున్నారు. త్వరలోనే ఈ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ తన కుటుంబాన్ని తీసుకొని కొత్తింట్లోకి ప్రవేశించనున్నాడని చెప్తున్నారు. అయితే ఇదంతా కేవలం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. కాబట్టి అనిల్‌ అన్ని కోట్లు ఖర్చుపెట్టి కొత్త బంగ్లా కొన్నాడా? లేదా? అనేది తెలియాలంటే ఆయన స్పందించేవరకు వేచి చూడాల్సిందే!

ప్రస్తుతం ఈ డైరెక్టర్‌ విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌తో కలిసి ఫన్‌ బాంబ్‌ ఎఫ్‌ 3 సినిమా చేస్తున్నాడు. గతేడాది సంక్రాంతికి రిలీజై ఘన విజయం సాధించిన ఎఫ్‌2కు సీక్వెల్‌గా వస్తోందీ చిత్రం. ఇందులో వెంకటేశ్‌ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, వరుణ్‌ తేజ్‌ పక్కన మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 27న థియేటర్లలో విడుదల కానుంది. 

చదవండి: పెద్ద దర్శకులు చిన్న సినిమాలు కూడా తీయాలి

స్టార్‌ డైరెక్టర్‌ హామీ ఇచ్చారు: అవినాష్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు